»   » మా హీరో సినిమాకే నెగిటివ్ గా రివ్యూ రాస్తావా, నిన్ను చంపుతాం, బూతులు

మా హీరో సినిమాకే నెగిటివ్ గా రివ్యూ రాస్తావా, నిన్ను చంపుతాం, బూతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూలు రావటం కామనే. ముఖ్యంగా వెబ్ మీడియాలో సినిమా రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే ట్వీట్ రివ్యూలని, పూర్తి సమీక్షలని రివ్యూలు వచ్చేస్తున్నాయి. బాగున్న సినిమాకు మంచి రివ్యూలు బాగా ప్లస్ అవుతున్నాయి. అయితే అన్ని రివ్యూలు హీరోల అభిమానులకు రుచించవు.

తమ హీరో సినిమా బాగున్నా, బాగోలేకపోయినా సూపర్ హిట్ అని రాయాల్సిందే అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తూంటారు. ఇక సినిమా సూపర్ హిట్టయ్యి, రివ్యూ తేడాగా రాస్తే ఇంక ఆ రివ్యూ రైటర్ పరిస్దితి దారణం. ఏకి పారేస్తున్నారు. అంతటితో ఆగటం లేదు ఇదిగో ఇలా చంపేస్తామని బెదిరింపులు కూడా మొదలెడుతున్నారు.

తాజాగా మలయాళంలో బిగ్గెస్ట్ స్టార్ అయిన మోహన్ లాల్ అభిమానుల నుంచి ఓ రివ్యూ రైటర్ కు అలాంటి సమస్యే ఎదురైంది. మోహన్ లాల్ కి అక్కడ భారీ గా ఫ్యాన్స్ ఉన్నారు. గత వారమే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన లాల్ సినిమా 'పులి మురుగన్' విషయంలో ఒకావిడ నెగెటివ్ రివ్యూ రాయడం పెద్ద దుమారమే రేపింది.

వారంలోనే 35 కోట్లు

వారంలోనే 35 కోట్లు

'జనతా గ్యారేజ్‌' సినిమాతో తెలుగులోనూ సూపర్‌ హిట్‌ అందుకున్న మోహన్‌ లాల్‌ 'పులిమురుగన్‌'లా మళయాళంలో మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు. దసరా కానుకగా మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ చిత్రం అక్కడ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. వారం రోజుల్లోనే రూ.35 కోట్లు కొల్లగొట్టిందీ సినిమా.

ఆవిడ రాసిన పోస్ట్ ఇదే

మళయాళంలో ఆ సినిమాని ఉద్దేసించి రాసి పేస్ బుక్ లో పెట్టారామె. అయితే ఆ సినిమాలోని లోపాలను ఆమె తనకు అనిపించినవి ఎత్తి చూపారు. అవే ఇప్పుడు ఫ్యాన్స్ ని మండేలా చేస్తున్నాయి.

రివ్యూలో రాసిందిదే

రివ్యూలో రాసిందిదే

ఇది శిఖర్.. నారన్ అనే రెండు సినిమాల్ని కలిపి కొట్టిన కథతో తెరకెక్కిందని.. మసాలాలన్నీ ఐదేసి గ్రాములు.. పది జీపులు.. మోహన్ లాల్ ను ఆకాశానికెత్తేసే డైలాగులు.. వంద మంది గూండాలు.. కలిపితే పులి మురుగన్ అని కామెంట్ చేసింది.

ఆవిడ ఎవరంటే..

ఆవిడ ఎవరంటే..

ఇంతకీ ఈ రివ్యూ రాసిన ఆవిడ ఎవరూ అంటే...నిషా మీనన్. ఆలిండియా రేడియోలో కథకురాలిగా.. వ్యాఖ్యాతగా.. అనౌన్సర్ గా పనిచేస్తున్నన్న నిషా.. ‘పులి మురుగన్' గురించి తన ఫేస్ బుక్ లో సెటైర్లు గుప్పిస్తూ సమీక్ష రాశారు.

ఆమెకే ఎక్కువే

ఆమెకే ఎక్కువే

మోహన్ లాల్ ఫ్యాన్స్ లాగే... ఆమెకు ఫేస్ బుక్ లో ఫాలోవర్లు కొంచెం ఎక్కువే. ఐతే తమ హీరో సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తోందంటూ మోహన్ లాల్ అభిమానులు ఆమెపైకి దండెత్తారు. బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు.

కుటుంబాన్ని లేపేస్తాం

కుటుంబాన్ని లేపేస్తాం

ఆమె పోస్టుపై ఏకంగా 4500 పైగా కామెంట్లు వచ్చాయి. నిషాను.. ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ కూడా కొందరు బెదిరించారు. ముందు వీళ్లకు భయపడింది నిషా..

ఆమె పోస్ట్ కు వచ్చిన కామెంట్స్ కొన్ని

ఆమె పోస్ట్ కు వచ్చిన కామెంట్స్ కొన్ని

" ఇలాంటివి రాయటానికి నీకు సిగ్గు లేదా?"

"నువ్వు మీ అమ్మ చెప్పినా కూడా మీ నాన్నను కూడా ఏక్సెప్టు చెయ్యవు"

"ఇలాంటి చెత్త అంతా రాస్తూంటే మీ ఆయన ఇంటి దగ్గర ఏమీ అనటం లేదా?"

"లాల్ గురించి రాసేంత ధైర్యమా. బయిటకు రా నీ పని చెప్తాం"

"ముమ్మట్టి ఫ్యాన్స్, మీడియా హౌస్ లు ఇలా రాసినందకు నీకు ఎంత ముట్ట చెప్పారు?"

ఎదురుదాడి చేస్తూ

దాడికి ఎదురుదాడిఆ తర్వాత వాళ్లపై ఎదురుదాడి చేస్తూ పోస్టు పెట్టింది. ఈ అంశం ప్రస్తుతం కేరళలో చర్చనీయాంశం అవుతోంది.

ఆమె ఎటాక్ చేసిన పోస్ట్ లో

ఆమె ఎటాక్ చేసిన పోస్ట్ లో

"నన్ను జనం అంతా చాలా కాలం నుంచి ఫేస్ బుక్ లో ఎరుగురు, నా స్టేటస్ లు చూస్తూనే ఉన్నారు. నేను రివ్యూలు రాస్తున్నాను, కరెంట్ ఇష్యూల మీద కామెంట్స్ రాస్తున్నాను. అయితే పులి మరగన్ విషయంలో నేను రాసింది మాత్రం జనాలకి నచ్చలేదు. మోహన్ లాల్ అభిమానులమని చెప్పుకునే కొందరు బూతులతో నాపై ఎటాక్ చేస్తున్నారు. ఇది దారుణం ," అని నిషా అన్నారు.

ఆమెరాసిన దాంట్లో నిజమెంత

ఆమెరాసిన దాంట్లో నిజమెంత

ఇక ఆమె కావాలని కాంట్రవర్శి కోసం రాసిందా ..అందులో నిజమెంత అనే విషయమే అక్కడ మీడియా చెప్పేదేమిటంటే.. ‘పులి మురుగన్' మాంచి మసాలా సినిమా అనేది వాస్తవం. రెగ్యులర్ వెరీటీగా ,విభిన్నంగా సినిమాలు చేసే లాల్.. ఈ సినిమాలో రొటీన్ మాస్ మసాలా కథను చేసారు. ఈ సినిమా కలెక్షన్లు భాక్సాఫీస్ ని బ్రద్దలు కొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి కానీ.. సమీక్షకులు మాత్రం ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.

భయపడాల్సిన అవసరం ఏమిటి

భయపడాల్సిన అవసరం ఏమిటి

మొదట ఆ కామెంట్స్ చూసి కంగారుపడ్డ ఆమె ఆ పోస్ట్ ని రిస్ట్రిక్ట్ చేసారు పబ్లిక్ నుంచి. కానీ కాస్సేపటికి ఆమె తిరిగి పబ్లిక్ ఆప్షన్ కు మార్చారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.."నా అన్ని పోస్ట్ లు పబ్లిక్ గానే పెడతాను. కానీ కొన్ని బూతు కామెంట్స్ మొదలవ్వటంతో అదీ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ..ఆ పోస్ట్ ని రిస్ట్రిక్ట్ చేసాను. కానీ తర్వాత ఆలోచించి కామెంట్స్ కి నేను ఎఫెక్ట్ అవటం ఏమిటి అని ఆలోచించి పబ్లిక్ ఆప్షన్ తీసుకున్నాను " అని వివరించారు.

నేను కేవలం వారి అభిమాననే

నేను కేవలం వారి అభిమాననే

నేను ఏ హీరోకూ అభిమానిని కాదు, కేవలం మంచి సినిమాలనే అభిమానిస్తాను. ఇలాంటి ఆన్ లైన్ ఎటాక్స్ కు భయపడి మాట్లాడటం మానెయ్యను. నా మనస్సు మార్చుకోలేను.

బిహేవియర్ మార్చుకోవాలి

బిహేవియర్ మార్చుకోవాలి

మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్స్ ఫ్యాన్ క్లబ్ లు తమ బిహేవిరయర్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.ఇలా ఆన్ లైన్ దాడులకు దిగటం పద్దతి కాదని ఆ హీరోలైనా తమ ఫ్యాన్స్ కు చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు.

ఇలాంటి ఫ్యాన్స్ లేకుండా స్టార్ గెలవలేరా

ఇలాంటి ఫ్యాన్స్ లేకుండా స్టార్ గెలవలేరా

చాలా మంది యంగ్ హీరోలు ఈ రోజున తమకు ఫ్యాన్ క్లబ్ లు లేకుండానే , తమ కెరీర్ లు బిల్డ్ చేసుకుంటున్నారు. అలాంటిది మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్ కు ఫ్యాన్ క్లబ్ ల అవసరం ఏమిటి. ఆయన స్టేచర్ కు ఇలాంటి ఫ్యాన్స్ అవసరమా అని ప్రశ్నించారు.

ఇలాంటి పరిస్దితే

ఇలాంటి పరిస్దితే

కొద్ది రోజుల క్రితం ఫృధ్వీ తాజ్ తాజా చిత్రం కు ఇలాంటి పరిస్దితే ఏర్పడింది. సినిమా కు నెగిటివ్ రివ్యూలు రావటంతో వెంటనే ఆయన ఫ్యాన్స్ దాడి మొదలెట్టారు. అయితే ఫృధ్వీ రాజ్ వెంటనే ఎలర్టై అలాంటి నెగిటివ్ ప్రచారం చేయవద్దని ఆయన ఫ్యాన్స్ ని సోషల్ మీడియాలో కోరారు.

మన్యం పులి

మన్యం పులి

‘పులి మురుగన్'ను తెలుగులోకి ‘మన్యం పులి' పేరుతో అనువదిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్స్ కూడా వదిలారు. టైటిల్ లోగో చాలా బాగా డిజైన్ చేశారు. ‘సింధూర పువ్వు' కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులోకి అందిస్తున్నారు.

జగపతిబాబు, కమిలిని

జగపతిబాబు, కమిలిని

వైశాఖ్ అనే యంగ్ డైరక్టర్ రూపొందించిన ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించడం విశేషం. అంతే కాదు మన జగపతి బాబు ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగులో వర్కవుట్ అవుతుందా

తెలుగులో వర్కవుట్ అవుతుందా

మోహన్ లాల్ కు తెలుగులో జనతాగ్యారేజ్, మనమంతాతో మార్కెట్ వచ్చింది. దాంతో ‘మన్యం పులి' తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్టయ్యే అవకాశముందంటున్నారు. కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. లాల్ ఇందులో అడవిలోనే నివసించే యోధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

పులి మురగన్ ట్రైలర్ ఇదిగో

ఇంతలా సంచలనం రేపుతున్న ఈ చిత్రం ట్రైలర్ చూడాలని మీకు ఉంటుంది కదా..ఇదిగో ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడండి మరి.

ఈ ట్రైలర్ అయితే జగపతి బాబు కేక

ఈ సినిమాలో జగపతిబాబు కీ రోల్ లో అంటే విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. తెలుగు మార్కెట్ కోసమే తీసుకున్నట్లుగా చెప్పినా ఆయన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
A woman, native of Thrissur, has come under heavy fire from the fans of Mohanlal after her Facebook post criticising the actor’s recent film Pulimurugan went viral. The last week’s post has drawn over 4,500 comments at the time of writing this piece.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu