»   »  సాయి కొర్రపాటితో... మోహన్ లాల్ ‘మనమంతా’

సాయి కొర్రపాటితో... మోహన్ లాల్ ‘మనమంతా’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నో విలక్షణమైన పాత్రలతో, కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్ పుట్టినరోజు మే 21. ప్రస్తుతం మోహన్ లాల్ తెలుగులో వారాహి చిలనచిత్రం బ్యానర్ లో రూపొందుతోన్న మనమంతా చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. విలక్షణ నటి గౌతమి కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది.

'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'సాహసం' వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం 'ఐతే'తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

Mohanlal telugu movie "Manamantha" details

'ఈగ', 'అందాల రాక్షసి','లెజండ్', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం 'ఈగ'తో నేషనల్ అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

'One world four stories'...నాలుగు కథలు ఒకటే ప్రపంచం అంటూ మనకు మరో మంచి చిత్రాన్ని అందించబోతున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆ నాలుగు కథలు ఎలాంటి మలుపులు తీసుకుని ఏ ముగింపు చేరుకుందనేదే కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుందని చిత్రయూనిట్ సభ్యులు తెలియజేశారు.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. త్వరలోనే చిత్రీకరణ ముగించుకని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోనున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, జివి చంద్రశేఖర్ ఎడిటింగ్ చేస్తున్నారు. మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Mohanlal's upcoming telugu movie "Manamantha" shooting in last stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu