»   » వివాదం: డైరక్టర్ పై పర్సనల్ రివేంజ్ తీర్చుకున్న మోహన్ లాల్

వివాదం: డైరక్టర్ పై పర్సనల్ రివేంజ్ తీర్చుకున్న మోహన్ లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: గత కొద్ది రోజులుగా మళయాళ పరిశ్రమలో, కేరళలో మోహన్ లాల్ పేరు ఓ వివాదంలో మారు మ్రోగుతోంది. రీసెంట్ గా మరణించిన కళాభవన్ మణి సంస్మరణ సభ గురించిన వివాదం మరో స్ధాయికి చేరింది. ఈ సంస్మరణ సభనుంచి దర్శకుడు వినయన్ ని తప్పించాలని ఆహ్వానితులను మోహన్ లాల్ కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుల అశోశియేషన్ అధ్యక్ష్యుడు ఓ ప్రకటన లో తెలియచేసి షాక్ ఇచ్చారు.

అయితే ఈ విషయమై మోహన్ లాల్ .. కూడా వినయన్ వస్తే తాను పంక్షన్ కు రాను అని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సభను నిర్వహించే ఆర్గనైజర్స్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి ఏర్పడింది. వినయన్..కళాభవన్ మణికు అత్యంత ఇష్టమైన దర్శకుడు. ఆయన్ని పిలవకుండా సభ నిర్వహించటం బాగోదని, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అలాగని మోహన్ లాల్ వంటి స్టార్ ని వదులుకునే స్ధితిలోనూ లేరు.

మోహన్ లాల్ అక్కడితో ఆగకుండా...ఆయన తనకు ఇష్టమైన దర్శకుడు , ఆర్మి ఓరియెంటెడ్ చిత్రాలు తీసే మేజర్ రవిని ఇన్వైట్ చేయమని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆ దర్శకుడుతో మణి ఒక్క సినిమా కూడా చేయలేదు.

Mohanlal Wanted To Omit Vinayan From Kalabhavan Mani Condolence Meet!

ఈ విషయమై దర్శకులు సంఘం అధ్యక్ష్యుడు ఓ ప్రెస్ మీట్ పెట్టి మోహన్ లాల్ వంటి స్టార్ ఇలా ప్రవర్తించటం పద్దతిగా లేదని, చాలా డిజప్పాయింట్ అయ్యానని అన్నారు. ఆయన తన పర్శనల్ రివేంజ్ తీర్చుకుంటున్నట్లు ఆయన అన్నారు. వినయన్ కు మోహన్ లాల్ కు ఉన్న విభేధాలను ఇలా ఓ సంస్మరణ సభ సందర్బంగా బయిటకు రావటం పద్దతిగా లేదని అన్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహిమ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ రెండూ 2016లోనే రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల కోసం ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాడు మోహన్ లాల్. కథలోని భావాన్ని సరిగ్గా పలికించాలంటే భాష మీద పట్టు ఉండాలనే ఉద్దేశంతో తెలుగు భాషను అభ్యసిస్తున్నాడు.

English summary
The controversies upon the Kalabhavan Mani condolence meet have reached a whole new level. The superstar who demanded to omit director Vinayan from the list of invitees, is none other than Mohanlal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu