twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మనీ మనీ మోర్ మనీ'కు మూలం ఆ సినిమానే

    By Srikanya
    |

    నటుడు నుంచి దర్శకుడుగా మారిన జెడీ చక్రవర్తి మొదటి నుంచి ప్రీ మేక్ లనే నమ్ముకుంటున్నారు. హోమం చిత్రం హాలీవుడ్ చిత్రం డిపార్టెడ్ కి తెలుగు వెర్షన్ కాగా, సిద్ద చిత్రం హిందీ చిత్రం అబ్ తక్ చప్పన్ కి తెలుగు అనువాదం. అలాగే ఈ నెల ఇరవై ఆరున విడుదల కానున్న మనీ మనీ మోర్ మనీ చిత్రం కూడా హిందీలో 2006లో జెడీ రూపొందించిన దర్వజా బంద్ రఖో చిత్రాన్ని ఉన్నదున్నట్లు తీసాడంటున్నారు. అలాగే ఈ దర్వాజా బంద్ రఖో కూడా కొరియన్ కామిడీ ఎటాకింగ్ ద గ్యాస్ స్టేషన్ కి కాపీ కావటం విశేషం. అయితే హిందీలో పెద్దగా వర్కవుట్ కానీ ఈ చిత్రం ఇక్కడ బ్రహ్మానందంపై వర్కవుట్ చేయవచ్చుననే ఐడియాతో తెరకెక్కించారు. మరి తెలుగులో ఈ తరహా కామిడీ ఎంత వరకూ పేలుతుందో చూడాలంటున్నారు. ఇప్పటికే ఎటాకింగ్ ద గ్యాస్ స్టేషన్ చిత్రాన్ని అల పేరుతో ఓ చిత్రం రూపొందించి బోర్లా పడ్డారు.

    ఇక మనీ మనీ మోర్ మనీ కథ ప్రకారం... అది 2009వ సంవత్సరం. రౌడీగా నగర ప్రజలను గడగడ లాడించిన ఖాన్‌దాదా తన గూండాగిరికి స్వస్తి పలికి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. పెరిగిన రియల్ బూమ్‌లో కోట్లకు పడగలెత్తాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. 2011వ సంవత్సరం వచ్చేసింది. రియల్ రంగం పేకమేడలా కూలిపోయింది. ఖాన్‌దాదా లాంటి రియల్ట్టర్లందరూ బొక్కబోర్లా పడ్డారు. ఖాన్‌దాదా కెవ్వున కేకపెట్టాడు. ఇప్పుడు తనకు మిగిలింది జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు, పుట్టెడు అప్పులు. ఫోన్‌బిల్లు, కరెంట్ బిల్లు కూడా కట్టలేని దుస్థితి.ఈ పరిస్థితిలో ఇల్లు అమ్ముకొని వెళ్లిపోదాం అనుకున్న సమయంలో నలుగురు కిడ్నాపర్లు ఆ ఇంట్లోకి చొరపడ్డారు. ఖాన్‌దాదాని ఓ బంతిని చేసి క్రికెట్, వాలీబాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ లాంటి ఆటలన్నీ ఆడేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఖాన్‌దాదా ఎలా బయపడ్డాడు అనేది క్లైమాక్స్.

    English summary
    "Money Money More Money" movie's story plot found to be inspired by 1999 Korean movie 'Attack the gas station' called as "thrilling comedy".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X