For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఖాన్ తో గేమ్స్ ఆడొద్దు...శాల్తీలు గల్లంతై పోతాయ్': ‘మనీ’ పార్ట్ త్రీ ..

  By Sindhu
  |

  న్యుజనరేషన్ కామెడి చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం 'మనీ'. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం సన్నివేశాల పరంగాను, సంగీత పరంగాను, చిత్రీకరణ పరంగాను కొత్త పుంతలు తొక్కింది. 'మనీ' అనగానే అందరికి మొదట 'ఖాన్ దాదా' గుర్తుకొస్తాడు. ఈ పాత్ర బ్రహ్మానందాన్ని సూపర్ స్టార్ ని చేసింది. 'ఖాన్ తో గేమ్స్ ఆడొద్దు...శాల్తీలు గల్లంతై పోతాయ్' అంటూ బ్రహ్మానందం చెప్పే ఊతపదం ఇప్పటికి పాపులరే. జే.డి. చక్రవర్తి హీరోగా తోలి బ్రేక్ ను ఇచ్చిన చిత్రమిది. 'వారేవా ఏమి ఫేసు', 'భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ...', చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి' మొదలైన సూపర్ హిట్ పాటలు ఇందులో వున్నాయి.

  'మనీ' ఘనవిజయం సాదించడంతో రామ్ గోపాల్ వర్మ 'మనీ మనీ' పేరుతొ దానికి సీక్వెల్ చేసారు. తాజాగా 'మనీ' కి పార్ట్ త్రీ రాబోతుంది. 'మనీ మనీ మోర్ మనీ' పేరుతొ రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడైన జే.డి.చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. 'ఖాన్ దాదా'గా బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. 'అనంతపురం', 'సర్వం' అనువాద చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాద్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ 'ఒకప్పుడు సంచలనం సృష్టించిన మనీ కి పార్ట్ త్రీ చేసే అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా వుంది తెలుగు లో ఇలా ఒక చిత్రానికి పార్ట్ త్రీ చేయడం అనేది ఇదే ప్రధమం 'మనీ మనీ' కి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. 'హోమం', 'సిద్దం' తో మాస్, యాక్షన్ చిత్రాలు బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్న జే.డి. 'మనీ మనీ మోర్ మనీ' తో కామెడి కూడా బాగా తీయగలరని నిరుపించుకుంటారు. ఆగస్టు మూడోవారంలో చిత్రీకరణ మొదలు పెడతాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కే ధరన్, కదా,స్క్రీన్-ప్లే, దర్శకత్వం: జె.డి.చక్రవర్తి.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X