»   » సింగర్ ఫొటోని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు....

సింగర్ ఫొటోని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

కింజాల్ దేవీ ఈ పేరు మనకి పెద్దగా పరిచయం లెరకపోవచ్చు గానీ ఆమధ్య ''చార్ చార్ బంగ్డీవాలీ''అంటూ గుజరాతీ జానపద గీతాన్ని ఆలపించి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. పాపం ఈ అమ్మాయి కూడా కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. అసలు కింజాల్ దేవీ కి కూడా తెలియని 30 ఏళ్ల యువకుడొకరు తన ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తన భార్య అంటూ ఫోటో పెట్టడాన్ని చూసి కింజాల్‌దేవి షాక్‌కు గురైంది.

సోషల్ మీడియాలో తన ఫోటో వచ్చిందంటూ స్నేహితులు చెప్పడంతో కింజాల్ వెంటనే చూసి విషయాన్ని తండ్రి లాల్జీభాయి దేవికి చెప్పింది. కింజాల్ తండ్రి అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా అమరాయివాడికి చెందిన నీరజ్ మక్వానా అనే యువకుడు నిందితుడని గుర్తించారు.

Morphed Photo:man morphs singer's pic, shows her as wife

ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్‌‌మెన్‌గా పనిచేస్తున్న నీరజ్ తన పెళ్లి చిత్రంలో భార్యను తొలగించి ఆ స్థానంలో గాయని కింజాల్ ఫోటోను మార్ఫింగ్ చేసి భార్యంటూ సోషల్ మీడియాలో పెట్టాడని అహ్మదాబాద్ సైబర్ సెల్ ఏసీపీ రాజ్‌వీర్‌సింగ్ చెప్పారు. నిందితుడైన నీరజ్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని ఏసీపీ వివరించారు.

English summary
Gujarati folk singer and Youtube sensation Kinjal Dave may have found much fame for her 'char char bangdi wali...' song. But that could not save her from falling prey to cyber crime
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu