గూగుల్‌ సెర్చ్‌: తెలుగు టాప్‌ హీరోస్‌ వీరే...(ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్: ప్రస్తుత కంప్యూటర్ కాలంలో ఇంటర్నెట్ అంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజన్. గత కొన్నేళ్లుగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏ సినిమా స్టార్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డాడనే విషయంలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎప్పటి లానే ఈ సంవత్సరం కూడా గూగుల్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డ సెలబ్రిటీల లిస్టు విడుదల చేసింది.

మన టాలీవుడ్ విషయానికొస్తే....సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యధికంగా సెర్చ్ చేయబడి నెం.1 స్థానం దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఆయన సినిమాలు ఏవీ హిట్ట కాక పోయినా ఇతర హీరోలను వెనక్కి తోసి మొదటి స్థానం దక్కించుకోవడం గమనార్హం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఇంటర్‌నెట్‌లో మనకు ఏ అవసరమోచ్చినా ముందుగా గూగుల్‌ సెర్చ్‌లోకి వెళుతుంటాం. అలాంటింది తమ అభిమాన నటుల కోసం నిత్యం గూగులో సెర్చ్‌లో ఫోటోలు చూస్తుంటారు. టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌ అనుకుంటారు అంతా..కానీ అందరి అంచనాలకు దూరంగా ప్రిన్స్‌ మహేష్‌కు గూగుల్‌లో ఎక్కువ క్లిక్స్‌ వచ్చి మొదటి స్థానంలో,

స్లైడ్ షోలో పూర్తి వివరాలు...

మహేష్ బాబు

మహేష్ బాబు

ఈ సంవత్సరం 1- నేనొక్కడినే, ఆగడు చిత్రాల్లో నటించిన మహేష్ బాబు ఆ రెండూ వర్కవుట్ కాకపోయినా గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ లో నిలిచారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

రెండో స్థానంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నిలిచారు. ఈ సంవత్సరం ఆయన నటించిన రేసు గుర్రం చిత్రం ఒక్కటే రిలీజైనా క్రేజ్ మాత్రం ఓ రేంజిలో ఉంది.

ప్రభాస్

ప్రభాస్

ఈ సంవత్సరం ప్రభాస్ ది ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు. అయినా బాహుబలి ఎప్పుడూ వార్తల్లో ఉండటం కలిసి వచ్చి...మూడో స్థానంలో ప్రభాస్‌ నిలిచారు.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి 150 వ చిత్రం ఎనౌన్సమెంట్ అంటూ ఊరిస్తూనే... ఆయన నాల్గో స్థానంలో వచ్చేసి మెగాస్టార్‌ అనిపించుకున్నాడు.

పవన్ ...

పవన్ ...

ఈ సంవత్సరం ఒక్క చిత్రం కూడా విడుదల కానీ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఐదో స్థానంలో నిలిచారు.

తమిళంలో టాప్ 1

తమిళంలో టాప్ 1

అలాగే తమిళంలో కూడా టాప్‌ 5 ప్లేస్‌లను పరిశీలిస్తే మొదటి స్థానంలో విజయ్‌ నిలిచారు. ఆయన కత్తి చిత్రం సూపర్ హిట్ అవటం ఆయనకు బాగా కలిసి వచ్చింది.

సూర్య

సూర్య

నిజానికి ఈ సంవత్సరం సూర్యకు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అంజాన్ పెద్ద ఫ్లాప్ అయ్యింది..అయినా క్రేజ్ మాత్రం అలాగే ఉంది. రెండో ప్లేస్ లో విజయ్ వచ్చారు.

రజనీకాంత్‌

రజనీకాంత్‌

ఈ సంవత్సరం అంతా లింగా హడావిడితోనే ఎప్పుడూ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మోగిపోయింది. అందుకే మూడో ప్లేస్ లో రజనీ వచ్చారు.

అజిత్‌

అజిత్‌

తల అజిత్ తన కిక్ బ్యాక్ రీ ఎంట్రీలో ఎప్పుడూ క్రేజ్ తగ్గింది లేదు. అందుకే ఆయన నాలుగో ప్లేస్ లో ఉన్నారు. ఆయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మంచి క్రేజ్ ఉంది.

కమల్‌హాసన్‌

కమల్‌హాసన్‌

ఈ సంవత్సరం కమల్ ది ఒక్క సినిమా కూడా రిలీజ్ లేదు. అయినా ఆయన ఐదవ ప్లేస్ లో నిలిచారు. తన సత్తా ఏంటో చూపారు.

అలాగే....

అలాగే....

మిగతా హీరోలు గూగుల్ సెర్చ్ లో చోటు చేసుకోకపోయి ఉండవచ్చు..అంత మాత్రాన వారికి క్రేజ్ లేదని అనుకోవాల్సిన వీలు లేదు. గూగుల్ సెర్చ్ కు రకరకాల కారణాలతో వెళ్తూంటారు.

ఫైనల్ గా...ఈ లిస్ట్ ని బట్టి ఎప్పుడో సినిమాలకు గుడ్‌బై చెప్పిన చిరంజీవి కూడా నాల్గో స్థానంలో ఉన్నారంటే మెగాస్టార్‌ ఇమేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. ఈ పరిశోధనను బట్టి మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సీనియర్‌ నటులైన రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి ల క్రేజ్‌లు కూడా ఏమాత్రం తగ్గలేదని అర్ధమౌతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X