»   » నమ్ముతారా? :మెహర్ రమేష్ డైరక్షన్ లో మహేష్, సాక్ష్యం ఇదిగో (వీడియో)

నమ్ముతారా? :మెహర్ రమేష్ డైరక్షన్ లో మహేష్, సాక్ష్యం ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెహర్ రమేష్ గుర్తున్నారా, ఎన్టీఆర్ తో కంత్రి చిత్రం తో మొదలెట్టి తర్వాత శక్తి, షాడో, వరస డిజాస్టర్ చిత్రాలతో వెనకపడ్డారు. అయితే ఆయనకు ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. మహేష్ వంటి స్టార్స్ ని ఆయన రెగ్యులర్ గా కలుస్తూంటారు. ఆ నేపధ్యంలో తాజాగా ఆయన మహేష్ తో ఓ యాడ్ చేసారని సమాచారం. ఆ యాడ్ ని మెహర్ రమేష్ తన ఫేస్ బుక్ పేజి ద్వారా షేర్ చేసారు.

మహేష్ బాబు తాజా చిత్రం బ్రహ్మోత్సవం గురించి అందరూ మాట్లాడుకుంటూంటే ఆయన ఇప్పుడు మరో యాడ్ తో తన వైపుకు జనాల్ని తిప్పుకున్నారు. విజయవాడకు చెందిన హౌసింగ్ ప్రాజెక్టు ప్రమోషన్ కు సంభందించిన యాడ్ చేసారు. ఆ యాడ్ మోస్ట్ స్టైలిష్ గా ఉండి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆ యాడ్ ని మీరు కూడా చూడండి.

విజయవాడ గుంటూరు హైవే లో రామకృష్ణ హౌసింగ్ ప్రెవేటు లిమిటెడ్ కొత్తగా నిర్మాణం చేయబోతున్న వెన్ జుయాకు మహేష్ అంబాసిడర్ గా వ్యవహిస్తున్నారు. దినికి సంభందించిన షూటింగ్ ను మెహర్ రమేష్ పూర్తి చేసారు. ఈ విషయమై మహేష్ ..ధాంక్స్ చెప్పారు మెహర్ రమేష కు ఇలా..

English summary
Watch Tollywood actor Mahesh Babu featuring in a commercial related with a housing project in Vijayawada. It is directed by Mehar Ramesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu