»   » అమ్మ గురించి ఇలా మన హీరో,హీరోయిన్స్ (ఫొటోలు)

అమ్మ గురించి ఇలా మన హీరో,హీరోయిన్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అమ్మకు జేజే అనని జీవులు ముఖ్యంంగా అతి తక్కువగా ఉంటారు. అతి అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో విలువ కట్టలేనిది అంటూ ఏమైనా ఉంది అంటే...అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఈ సృష్టిలో అమ్మ లేకుండా ఏదీ లేదు.

  ఎంత స్టార్ డమ్ వచ్చినా, పుట్టుకతోటే వారు స్టార్స్ కాదు కదా...ఎంతటి సినీ ప్రముఖులైనా తొలిసారి ప్రపంచాన్ని చూసేది అమ్మ కళ్లతోనే. అలాగే తొలి అడుగు వేసేది ఆమె వేలు పట్టుకొనే. 'మదర్స్ డే ' సందర్భంగా...మన హీరోలు, బాలీవుడ్ స్టడా్స్ తమ మాతృమూర్తుల గురించి చెప్పిన కొన్ని సంగతులు ఇక్కడ చూద్దాం

  ఈ సృష్టికి మూలం ఆ భగవంతుడు అవునో కాదు తెలియదు కాని, మానవ సృష్టికి మూలం మాత్రం అమ్మే. మనల్ని ఓ కొత్త ప్రపంచానికి పరిచయం చేసే ఆ మాతృ మూర్తికి మనసారా వందనాలు తెలియజేయటం మనందరి కర్తవ్యం. మదర్స్ డేను పురస్కరించుకుని సినీతారల అమ్మ ప్రేమపై ఓ లుక్కేద్దాం....

  ముంబయి: మదర్స్‌ డే సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులు అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మలతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌, సోనూ సూద్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కరణ్‌ జోహార్‌, ప్రీతీ జింతా, మాధురీ దీక్షిత్‌, క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌, ఆయుష్మాన్‌ ఖురానా, రవీనా టాండన్‌, రిషి కపూర్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా వారి అమ్మతో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు.

  మదర్స్ డే సందర్బంగా అల్లు అర్జున్ తన తల్లితో తొలి సెల్ఫీ దిగి ట్వీట్ చేసారు.

  ఎన్టీఆర్

  ఎన్టీఆర్

  ఎన్టీఆర్ మాట్లాడుతూ...చాలామంది తల్లులు తెలీని భయాలతో పిల్లల్ని బయటికి పంపించడానికి ఇష్టపడరు. మా అమ్మ మాత్రం ఏ విషయమైనా సొంతంగా నేర్చుకోమనేది. ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్లమనేది. వూహ తెలిసినప్పట్నుంచీ అమ్మెప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు అన్నారు.

  ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ..

  ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ..


  నా చుట్టూ ఉన్న పరిస్థితుల్నీ, తను పడే ఇబ్బందుల్నీ చూపిస్తూనే, నాకంటూ ఏదైనా ప్రత్యేకతను సృష్టించుకున్నప్పుడే నలుగురిలోనూ మా ఇద్దరికీ గుర్తింపు వస్తుందనేది. తనవల్లే కూచిపూడి నేర్చుకున్నా. తన నుంచే నలుగురిలో మాట్లాడటం తెలుసుకున్నా అని చెప్పుకొచ్చారు.

   నాగచైతన్య

  నాగచైతన్య

  నేనూ, అమ్మ ... పద్దెనిమిదేళ్ల వరకూ నాకు తెలిసిన ప్రపంచం మేమిద్దరమే. నన్ను కోప్పడాలన్నా, ప్రేమించాలన్నా, నాతో ఆడుకోవాలన్నా, బయటకు తీసుకెళ్లాలన్నా అన్నిటికీ అమ్మే తోడు. క్రికెట్‌, మ్యూజిక్‌, ఫొటోగ్రఫీ, రేసింగ్‌... ఏది ఇష్టమంటే అది నేర్పించింది అని నాగచైతన్య ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.

  నాగచైతన్య కంటిన్యూ చేస్తూ..

  నాగచైతన్య కంటిన్యూ చేస్తూ..

  ఏదైనా కావాలని అడిగితే, ‘ముందు ఈ పరీక్ష పాసవ్వు, క్రికెట్‌లో బాగా ఆడి మీ జట్టుని గెలిపించు' అంటూ లక్ష్యాలు పెట్టేది. వూరికే వచ్చిందేదీ సంతోషాన్ని ఇవ్వదని చెప్పడమే అక్కడ అమ్మ ఉద్దేశం. సినిమా కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ రంగంలో ఎత్తుపల్లాలు అమ్మకు తెలుసు. అందుకే డిగ్రీ పూర్తయ్యాకే సినిమాలని కచ్చితంగా చెప్పింది. ఫ్రెండ్‌గా, గురువుగా, గైడ్‌గా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అమ్మే.

  రకుల్ ప్రీతి సింగ్

  రకుల్ ప్రీతి సింగ్  నాకు మూడేళ్ల వయసప్పుడే అమ్మ నన్ను భవిష్యత్తులో హీరోయిన్‌గా చూడాలనుకుంది. అందుకే ఆ వయసులోనే నన్ను అందంగా తయారు చేసి టీవీ ప్రకటనల్లోనూ నటింపజేసింది.

  రకుల్ కంటిన్యూ చేస్తూ..

  రకుల్ కంటిన్యూ చేస్తూ..

  నాన్న కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నప్పుడు మేం చాలా భయపడ్డాం. అమ్మ మాత్రం ఆయన బాధ్యతల గురించి వివరించి ధైర్యం చెప్పేది. ఆరోజుల్లో అమ్మ అలా ఎలా ఉండగలిగిందో ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది.

  హీరోయిన్ అయ్యిండేదాన్ని కాదు..

  హీరోయిన్ అయ్యిండేదాన్ని కాదు..

  క్లాస్‌ ఫస్ట్‌ రాకపోయినా ఫర్వాలేదు కానీ అన్నింట్లోనూ కొంత ప్రావీణ్యం ఉండాలనేది. తన వల్లే స్విమ్మింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, కరాటే లాంటి విద్యలు నేర్చుకున్నా. కాలేజీకి వచ్చాక అమ్మ నన్ను మోడలింగ్‌పైపు తేకపోయుంటే నేను హీరోయిన్‌ అయ్యుండేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీతి సింగ్.

  నందిత

  నందిత


  ప్రేమ కధాచిత్రం ఫేమ్ నందిత మాట్లాడుతూ... అమ్మ నాకు చాలా క్లోజ్. ఇంకా చెప్పాలంటే.. బెస్ట్ ఫ్రెండ్ కూడా. తనతో నేను అన్ని షేర్ చేసుకుంటారు. నా ప్రతీ విజయంలో అమ్మ సపోర్ట్ ఉంటుంది. వర్క్ ఫీల్డ్‌లో కూడా నాకు సహాయంగా వస్తుంది. నా కోసమే న్యాయవాద వృత్తిని వదిలేసింది. షూటింగ్‌లో నేను ఎక్కడ ఉంటే అమ్మ అక్కడ ఉండాల్సిందే! నా కెరీర్ కోసం తన కెరీర్‌నే వదిలేసింది అమ్మ అని చెప్పుకొచ్చింది.

  ఆర్తన(సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు హీరోయిన్)

  ఆర్తన(సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు హీరోయిన్)  నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అన్నీ తానై నన్ను, చెల్లిని ఏ లోటు రాకుండా చూసుకుంది అమ్మ. మాకు నాన్న లేడు అనే ఫీలింగ్ రాకుండా పెంచింది అమ్మ. దేవుడి రూపంలో ఉన్న మనిషంటే అది కేవలం అమ్మ మాత్రమే అని చెప్పుకొచ్చింది.

  రేష్మ( ఈరోజుల్లో ఫేం)

  రేష్మ( ఈరోజుల్లో ఫేం)

  నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి అమ్మ సినిమాల కోసం నా ఫొటోలు పంపించేది. అలానే ఈరోజుల్లో సినిమాలో అవకాశం వచ్చింది. అమ్మ ఎల్‌ఎల్‌ఎమ్ చదివింది. అమ్మను ఆదర్శంగా తీసుకుని ఎల్‌ఎల్‌బి చదివాను. సినిమాల్లో అవకాశాలు రావడంతో వదిలేశాను. అమ్మ నాతో అమ్మలా ఉండదు. ఒక ఫ్రెండ్‌లా ఉంటుంది. బయటికి వెళ్తే ముందు ధైర్యం చెప్తుంది.

   ప్రగ్యా జైస్వాల్ ( కంచె ఫేమ్)

  ప్రగ్యా జైస్వాల్ ( కంచె ఫేమ్)  మా కుటుంబ సభ్యుల్లో అమ్మే నా బెస్ట్ ఆప్షన్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ చేయడంలో మా అమ్మ దిట్ట. అందుకే నా ఫ్రెండ్స్ అందరూ అమ్మకు ఫ్రెండ్సయిపోయారు. నేను లేకపోయినా ఇంటికొచ్చేసి అమ్మతో కాలక్షేపం చేసి వెళ్తారు. ఒకరకంగా నా కంటే నా ఫ్రెండ్స్‌తో మా అమ్మే ఎక్కువ క్లోజ్‌గా ఉంటుంది.
  లవ్యూ మామ్!

  రాశి ఖన్నా

  రాశి ఖన్నా


  అమ్మకు మెటీరియలిస్ట్‌గా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా నాచురల్‌గా ఉంటేనే ఇష్టపడుతుంది. అందుకే అమ్మ బర్త్‌డేకి, మదర్స్ డేకి స్పెషల్‌గా నేనే స్వయంగా కార్డ్ తయారుచేస్తా. ఈ సంవత్సరం కూడా చేశా. అమ్మకు, నాకు మధ్య అస్సలు దాపరికాలు ఉండవు. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా.. ఎలాంటి విషయాలనైనా అమ్మతో షేర్ చేసుకుంటా. ఐ లవ్‌యూ అమ్మా..!

  లావణ్య త్రిపాఠి

  లావణ్య త్రిపాఠి

  అమ్మ అంటే నాకు చాలా గౌరవం. నన్ను అర్థం చేసుకోగల ఏకైక మనిషి అమ్మే. నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నేను చిన్న కూతురిని కదా.. కాబట్టి నన్ను పెద్దగా తిట్టింది, కొట్టింది లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆమె చాలా స్ట్రాంగ్. అమ్మకున్నంత ఓపిక, సహనంలో ఒక్కశాతం కూడా నాకు లేదు. ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి నేనింకా!

  రామ్ గోపాల్ వర్మ

  రామ్ గోపాల్ వర్మ

  నేనో చెడ్డ కొడుకని మా అమ్మ ఆలోచన. కానీ తను మాత్రం ఓ మంచి అమ్మ. మంచి తల్లి ఎప్పుడూ చెడ్డ కొడుకు శుభాకాంక్షలు కోరుకోదు. కాబట్టే నేను మాతృదినోత్సవ వేడుక శుభాకాంక్షలు చెప్పను.

  పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్

  పవన్ కు తన తల్లి అంటే ప్రాణం ..ఈ విషయం ఆయన చాలా సార్లు స్పష్టం చేస్తూంటారు.

  అఖిల్

  అఖిల్

  అఖిల్ తన తల్లి అమల అంటే ప్రాణం. అయితే ఆయన కెరీర్ విషయాల్లో ఆమె కలగచేసుకోవటానికి ఇష్టపడరు.

  అనుష్క తల్లితో

  అనుష్క తల్లితో

  అనుష్క శెట్టి తన తల్లితో కలిసి...ఇదిగోఏోసో

  వరుణ్ తేజ

  వరుణ్ తేజ

  నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తన తల్లిని తన తో పాటే ఎక్కువగా తీసుకువెళ్ళటానికి ఇష్టపడతారు

  సాయిధరమ్ తేజ

  సాయిధరమ్ తేజ

  మెగా హీరో సాయి ధరమ్ తేజ తను ఈ రోజున నిలబడటానికి కారణం తన తల్లి ప్రోత్సాహమే అని చెప్తారు

  అల్లు అర్జున్, శిరీష్

  అల్లు అర్జున్, శిరీష్

  తమ తల్లి తో ఈ అన్నదమ్ములిద్దరూ...

  హన్సిక

  హన్సిక

  ఈ తల్లి కూతుళ్లిద్దరూ ప్రెండ్స్ లాగ మెలుగుతూంటారు సెట్స్ మీద కూడా

  కాజల్

  కాజల్

  హీరోయిన్ కాజల్ తన తల్లి తో ప్రతీ విషయం పంచుకుంటానని చెప్తారు.

  మధుశాలిని

  మధుశాలిని

  తన తల్లి మధుశాలిని తన వెన్నంటే ఉంటారని ఆమె చెప్తున్నారు

  నాని

  నాని

  హీరో నాని తన తల్లి అంటే ప్రాణం అంటూంటారు

  నరేష్

  నరేష్

  నరేష్ తన తల్లి విజయనిర్మలతో కలిసి ఇలా..

  పూర్ణ

  పూర్ణ

  హీరోయిన్ పూర్ణ తన తల్లి ప్రోత్సాహమే తన కెరీర్ లో ఎదుగలకు కారణం అంటుంది

  ప్రభాస్

  ప్రభాస్

  ప్రపంచానికి ప్రభాస్ బాహుబలి కానీ తన తల్లి దగ్గర మాత్రం...

  రామ్ చరణ్

  రామ్ చరణ్

  రామ్ చరణ్ కు తన తల్లి సురేఖ దగ్గర చనువు బాగా ఎక్కువ.ఆమె లేనిదే ఆయన ఫంక్షన్స్ కు కూడా ఎక్కువ వెళ్లరు

  రానా

  రానా

  రానా దగ్గుపాటి తన తల్లితో కలిసిన ఫొటో

  శ్రద్దాదాస్

  శ్రద్దాదాస్

  శ్రద్దదాస్ తన తల్లితో ఎక్కువగా గడపుతూంటారు.

  సుశాంత్

  సుశాంత్

  హీరో సుశాంత్ తన తల్లి నాగ సుశీలతో కలిసి ఇలా...

  మహేష్

  మహేష్

  మహేష్ బాబు తన తల్లి తో కలిసి ఇలా...

  సమంత

  సమంత

  సమంత తన తల్లితో కలిసిన చైల్డ్ హుడ్ ఫొటో ఇది..

  English summary
  "A Mother Is Always Beginning. She Is How Things Began. Entire world is celebrating one of the most beautiful days i.e., Mother's Day and I am sure you all have already planned some surprise for your moms, in order to make her feel special.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more