సినిమా స్టార్ల నుంచి పొలిటీషియన్ల దాకా... ‘సాహో’ జపం, ఈ ట్వీట్లు చూశారా?
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసకెళ్లిన చిత్రం 'బాహుబలి'. ఇది మన వాళ్లు తీసిన సినిమా అని ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పుకుంటాడు. బాహుబలి స్టార్ ప్రభాస్ నటించిన మరో భారీ చిత్రం 'సాహో'. ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, యాక్షన్ చిత్రాల పరంగా చూస్తే భారత దేశపు అతిపెద్ద మూవీ. మరి ఇలాంటి సినిమా మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరిలోనూ గర్వం ఉంటుంది. అందుకే తెలుగు సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు 'సాహో'కు మద్దతుగా ట్వీట్స్ చేశారు. అభిమానులతో పాటు ఫ్యాన్స్ 'సాహో' జపం చేస్తుండటంతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది.
విజయ్ దేవరకొండ
సాహో చిత్ర బృందాన్ని విష్ చేస్తూ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ప్రభాస్ అన్నతో పాటు చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు. ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావాలి అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
సుధీర్ బాబు
తెలుగు సినిమా అభిమానుల కలను నిజం చేస్తూ మన ఇండస్ట్రీని వరల్డ్ మ్యాప్‌లో నిలబెట్టాడు. ప్రభాస్, దర్శకుడు సుజీత్, యువి క్రియేషన్స్ వారు ‘సాహో' కోసం చాలా కష్టపడ్డారు. ఈ మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను.
సి.ఎం రమేష్
ప్రముఖ పొలిటీషియన్, రాజ్య సభ ఎంపీ సిఎం రమేష్ సాహో చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సాహో ఫీవర్ ఉంది అంటూ ఆయన తన ట్విట్లో పేర్కొన్నారు.
జగ్గు భాయ్
‘సాహో' చిత్ర బృందాన్ని విష్ చేస్తూ జగపతి బాబు ట్వీట్. ఈ చిత్రం భారీ విజయం అందుకోవాలంటూ తన మనసులోని మాటను ఆయన ఇలా ఫోటో ద్వారా బయట పెట్టారు.
సుశాంత్
బాహుబలి
నిఖిల్ సిద్ధార్థ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
డివివి ఎంటర్టెన్మెంట్స్
నవీన్ చంద్ర
సుధీర్ వర్మ
హారిక హాసిని క్రియేషన్స్
వెంకీ అట్లూరి
మహేష్ ఎస్ కోనేరు


Click it and Unblock the Notifications











