twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెల్‌తో సినిమా: లెన్స్ కంటే కామన్ సెన్స్ ముఖ్యం

    By Bojja Kumar
    |

    సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇతర రంగాలతో పాటు వినోద రంగమైన సినిమా రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమా చూడాలంటే తప్పనిసరిగా థియేటర్లకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు టీవీతో పాటు సెల్ ఫోన్ లో అరచేతిలోసినిమా చూసే వెసులుబాటు లభించింది. ఒకప్పుడు సినిమా చిత్రీకరణకు ప్రత్యేకమైన కెమెరాలు వాడే వారు. కానీ ఇప్పడు డిజిటల్ స్టిల్ కెమెరాలతో కూడా సినిమాలు తీస్తున్నారు. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'దొంగల ముఠా" సినిమానే ఇందుకు నిదర్శనం. వర్మ తాజా సినిమా బెజవాడ రౌడీల్లో కూడా అలాంటి కెమెరాలనే ఉపయోగిస్తున్నాడు.

    సినిమా చిత్రీకరణ అంశంపై ప్రముఖ చాయా గ్రాహకుడు, ఐదుసార్లు జాతీయ అవార్డు జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ మాట్లాడుతూ...సినిమాని పలానా కెమెరాతోనే తీయాలనే నిబంధన ఏమీ లేదు. సినిమా తీయాలంటే లెన్స్ కంటే కామన్ సెన్స్ ముఖ్యం, సెల్ ఫోన్ తో కూడా సినిమా తీయొచ్చని అంటున్నారు. యూట్యూబ్ లో సెల్ ఫోన్ తో తీసిన అబ్బుర పరిచే వీడియోలు చాలా కనిపిస్తాయి అని, సృజన, కళాత్మక దృష్టి ఉంటూ ఎవరైనా సరే టాలెంట్‌ను నిరూపించుకోవచ్చంటున్నారు. మరి...మీకూ అలాంటి సృజన, కళాత్మక దృష్టి ఉంటే ట్రై చేయండి.

    English summary
    Movie making on Cell is possible. Lenses is not important to make Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X