ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనపై తెలుగు సినిమా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో తాను ఈచిత్రాన్ని రూపొందించబోతున్నాను. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. నేను దీన్ని నార్మల్ కమర్షియల్ సినిమాలా కాకుండా యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా తెరకెక్కించబోతున్నాను' అని అల్లాని శ్రీధర్ చెప్పుకొచ్చారు.
దర్శకుడు, నిర్మాత అయిన అల్లాని శ్రీధర్ గతంలో నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురంభీం జీవితంపై సినిమాను రూపొందించారు. అదే విధంగా గౌతమ బుధ్దుడిపై చరిత్రాత్మక చిత్రాన్ని కూడా రూపొందించారు. తాజాగా శ్రీధర్ ఎంతో సున్నితమైన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమాను రూపొందించబోతున్నారు.
అయితే ఈ చిత్రం డాక్యుమెంటరీలా మాత్రం ఉండదని, పూర్తి స్థాయి చిత్రంగా ఉంటుందని, యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ ఘటనపై దేశ వ్యాప్తంగా యువత చైతన్య వంతులై స్పందించడం ఆహ్వానించ దగ్గ విషయమని, అదే సమయంలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ లాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా, యువత పెడదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


Click it and Unblock the Notifications











