For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీఎం జగన్ చెడ్డీలు వేసుకొనేటప్పటి నుంచి.. ఎంపీ రఘురామరాజుపై నిర్మాత నట్టికుమార్ ఫైర్

  |

  తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, టికెట్ల సమస్య గురించి ఇటీవల కాలంలో చిన్న నిర్మాతల సంఘం ప్రతినిధి, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య సినీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశానికి చిన్న సినిమా నిర్మాతలను ఆహ్వానించకపోవడంపై చిరంజీవి మండిపడిన ఆయన తాజాగా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించారు. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అటు ప్రభుత్వాలు గానీ, ఇటు సినీ ప్రముఖులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్‌ పరిశ్రమలోని సమస్యలను ఎలుగెత్తి చాటడానికి ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ..

   ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలుస్తాం

  ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలుస్తాం

  టాలీవుడ్‌లో చిన్న నిర్మాతలు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తాం. అందుకోసం ఆయన అపాయింట్‌మెంట్‌ను కోరుతాం అని నట్టి కుమార్ అన్నారు. అయితే చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు కలిసేందుకు చేస్తున్న నేపథ్యంలో నట్టి కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. చిన్న నిర్మాతలను చిరంజీవి, ఇతర బడా నిర్మాతలు పట్టించుకోవడం లేదనే వివాదం మధ్య ఈ విషయం వివాదాస్పదంగా మారింది.

  చిరంజీవి బృందంపై నట్టి కుమార్ అసంతృప్తి

  చిరంజీవి బృందంపై నట్టి కుమార్ అసంతృప్తి


  ఏపీలో టికెట్ రేట్ల పెంపు, థియేటర్ యాజమాన్యాలకు రాయితీలు, ఇతర విషయాలపై చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలోని బృందానికి సెప్టెంబర్ 4వ తేదీన అపాయింట్‌మెంట్ ఇచ్చారనే వార్త నేపథ్యంలో నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని సినీ వర్గాుల ప్రస్తావిస్తున్నాయి. ఈ ప్రెస్ మీట్‌తో నట్టి కుమార్ మాట్లాడుతూ.. చిన్న నిర్మాతలకు చిరంజీవి బృందంలో ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం. ఏపీ సీఎంకు చిన్న నిర్మాతలు కలిసే సమయంలో చిరంజీవిని తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

   ఏపీలో టికెట్ రేట్ల వివాదాన్ని సీఎం దృష్టికి

  ఏపీలో టికెట్ రేట్ల వివాదాన్ని సీఎం దృష్టికి

  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన సమయంలో చిన్న నిర్మాతల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తే చాలా సంతోషపడుతాం. చిన్న నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు 20 మందితో కూడిన బృందం అపాయింట్‌మెంట్ కోరాం. 35 జీవో చిన్న నిర్మాతలకు, పరిశ్రమకు కల్పతరువు. అలాంటి జీవోను ఏపీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించరాదు. అలాగే టిక్కెట్ల రేట్లు రూ.100 మించకుండా ఉండాలన్నది మా మనవి అని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.

  పెద్ద నిర్మాతలపై నట్టి ఫైర్

  పెద్ద నిర్మాతలపై నట్టి ఫైర్

  ఏపీలో వివాదంగా మారిన టికెట్ రేట్లపై సరైన నిర్ణయం తీసుకోవాలి. బీసీ సెంటర్లలో తక్కువగా ఉన్న రేట్లను కొంచెం పెంచాలి. బ్లాక్ టికెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతాం. కొందరు పెద్ద నిర్మాతలు, ఇంకొందరు సినీ ప్రముఖులు పరిశ్రమ మనుగడ కంటే కోట్ల సంపాదనపైనే వారు దృష్టిపెట్టారు. చిన్న నిర్మాతలను ఏ రోజు వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వారి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం కావాలని నిర్ణయించుకొన్నామని నట్టి కుమార్ అన్నారు.

  ఏపీ సీఎంపై రాఘురామ రాజు తీవ్రమైన వ్యాఖ్యలు

  ఏపీ సీఎంపై రాఘురామ రాజు తీవ్రమైన వ్యాఖ్యలు

  సీఎం జగన్ చడ్డీలు వేసుకున్నప్పటి నుంచి థియేటర్లలో టిక్కెట్ ధరలను ఇంకా కొనసాగిస్తున్నారంటూ ఎంపీ రాఘురామరాజు చేసిన విమర్శలను నట్టి కుమార్ తప్పుపట్టారు. సినీ పరిశ్రమ గురించి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్ ఖండించారు. ఏపీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రఘురామ కృష్ణంరాజుకు సినీ పరిశ్రమతో పరిచయాలు ఉండవచ్చు, కానీ సమస్యలపై సంపూర్ణ అవగాహన లేకుండా, కేవలం విమర్శించాలన్న ఒకే ఒక కారణంతో మాట్లాడటం బాధ్యతారాహిత్యం. జీవో 35కు విరుద్ధంగా టికెట్ల రేట్లు 200, 300 రూపాయలు ఉండాలంటూ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కొందరు సినీ పెద్దలు ఆయనతో ఆలా మాట్లాడించారని తాను అనుకుంటున్నా.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  రాఘురామ రాజును సవాల్ చేసిన నట్టి కుమార్

  రాఘురామ రాజును సవాల్ చేసిన నట్టి కుమార్

  రాఘురామ రాజు పార్లమెంట్ నియోజకవర్గం నర్సాపురంలోనే బహిరంగంగా ప్రజల మధ్యన టిక్కెట్ల రేట్ల విషయంలో ఎవరు కరెక్టో తేల్చుకునేందుకు తనతో కలిసి వస్తారా అని నట్టి కుమార్ సవాల్ విసిరారు. నా సవాల్‌ను ఎదుర్కోవడానికి ఆయన సిద్దమేనా? అంటూ ప్రశ్నించారు. ప్రజాకోర్టులో రఘురామ కృష్ణంరాజు ఓడిపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? ఒకవేళ తాను ఓడిపోతే ఆయనకు ప్రజా సమక్షంలో పాలాభిషేకం చేస్తానని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

  English summary
  MP Raghu Rama Raju serious on YS Jagan Mohan Reddy over Ticket Rates issue, Proudcer Natti Kumar condemns.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X