Sarkaru Vaari Paata సెట్లో అనుకోని అతిథి.. సాదరంగా ఆహ్వానించిన మహేష్ బాబు

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మరో బ్లాక్‌బస్టర్‌తో రికార్డులు తిరుగరాయాలని సిద్దమవుతున్నాడు. తాజాగా సర్కారు వారి పాట సినిమా షూటింగులో తలమునకలై ఉన్నారు. గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడటంతో సర్కారు వారి పాట రిలీజ్ వెనుకకు వెళ్లింది. అయితే సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారడంతో మళ్లీ సూపర్ స్టార్ మహేష్ షూటింగును ప్రారంభించి వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మహేష్ బాబు షూటింగులో శశిథరూర్

మహేష్ బాబు షూటింగులో శశిథరూర్

అయితే ఎప్పుడు రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగులో రాజకీయ నేత ప్రత్యక్షం కావడం విశేషంగా మారింది. సర్కారు వారి పాట షూటింగుకు ప్రముఖ రాజకీయ వేత్త శశిథరూర్ రావడం, సెట్లో ప్రత్యక్షం కావడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. శశిథరూర్ వెంట మహేష్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ కూడా ఉండటం మరింత విశేషంగా మారింది.

షూటింగుకు శశి థరూర్ ఎందుకొచ్చాడంటే..

షూటింగుకు శశి థరూర్ ఎందుకొచ్చాడంటే..

అయితే సినిమా ప్రపంచానికి దూరంగా ఉండే శశిథరూర్ మహేష్ షూటింగుకు ఎందుకు వచ్చారు? గల్లా జయదేవ్ ఎందుకు తోడు తీసుకొచ్చారనే విషయంపై పెద్దగా క్లారిటీ లభించలేదు. తన షూటింగుకు వచ్చిన శశిథరూర్‌ను మహేష్ బాబు వినయపూర్వకంగా స్వాగతించారు. సెట్లోకి రాగానే శశికి మహేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ అందజేశారు.

సెట్లో శశిథరూర్ హంగామా

సెట్లో శశిథరూర్ హంగామా

సర్కారు వారి పాట షూటింగులో కాసేపు శశిథరూర్‌, ఎంపీ గల్లా జయదేవతో మహేష్ బాబు ముచ్చటించారు. అనంతరం సినిమా గురించిన విషయాలను అడిగి తెలుసుకొన్నారు. అంతేకాకుండా సెట్‌లోని పలు అంశాలను నిశితంగా పరిశీలించినట్టు తెలిసింది. సెట్ అంతా కలియదిరిగి షూటింగుకు సంబంధించిన కొన్ని విషయాలపై తన సందేహాలను తీర్చుకొన్నట్టు సమాచారం.

మహేష్ బాబుతో అత్యంత సన్నిహితంగా

మహేష్ బాబుతో అత్యంత సన్నిహితంగా


సర్కారు వారి పాట సినిమా షూటింగు శశిథరూర్ రాకతో సందడిగా మారింది. అనుకోని అతిథి ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఆశ్చర్యానికి గురి అయింది. మహేష్ బాబు, శశిథరూర్ మధ్య సన్నిహిత్యాన్ని చూసి అందరూ సంతోషానికి గురయ్యారు. శశితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గల్లా జయదేవ పంచుకొన్నారు.

Recommended Video

Sridevi Soda Center : కథలో నిజాయితీ ఉంటే.. ఎవ్వడూ ఏం చెయ్యలేడు Director Karuna Kumar
ఎవరీ శశిథరూర్ అంటే..

ఎవరీ శశిథరూర్ అంటే..

ఇక శశి థరూర్ విషయానికి వస్తే.. ఐక్యరాజ్యసమితిలో ఆయన అండర్ సెక్రటరీగా సేవలు అందించారు. ఆ తర్వాత యూఎన్‌ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యలను నిర్వర్తించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖా సహాయమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తిరువనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ దౌత్యవేత్తగానే కాకుండా రచయితగా మంచి పాపులారిటిని శశిథరూర్ సంపాదించుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X