»   » ‘మామ్’ తర్వాత శ్రీదేవి మరో సంచలనం...!

‘మామ్’ తర్వాత శ్రీదేవి మరో సంచలనం...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరోగా ఫిల్మ్ గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లో బాలీవుడ్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.

'మిస్టర్ ఇండియా' సినిమాను అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ నిర్మించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'మామ్' సినిమాతో బిజీగా ఉన్న శ్రీదేవి ఈ చిత్రం తర్వాత 'మిస్టర్ ఇండియా-2'లో నటించబోతోందట.

అవే పాత్రల్లో అనిల్, శ్రీదేవి

అవే పాత్రల్లో అనిల్, శ్రీదేవి

త్వరలో ‘మిస్టర్ ఇండియా-2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని... ఇందులో శ్రీదేవి, అనిల్ కపూర్ అదే పాత్రల్లో నటించబోతున్నారని తెలుస్తోంది.

హర్షవర్దన్ కపూర్

హర్షవర్దన్ కపూర్

అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్‘మీర్జా' సినిమా ద్వారా హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కుమారుడికి మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంలో ‘మిస్టర్ ఇండియా-2' చిత్రాన్ని హర్షవర్దన్‌ హీరోగా ప్లాన్ చేస్తున్నాడట అనిల్ కపూర్.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

మిస్టర్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కపూర్... సీక్వెల్‌కు దర్శకత్వం వహించేందకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో వేరొకరితో ఈ సినిమా చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ‘బాగ్ మిల్ఖా బాగ్' డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా లేదా ‘మామ్' దర్శకుడు రవి ఉడియార్ చేతికి ‘మిస్టర్ ఇండియా-2' ప్రాజెక్టు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

త్వరలో మరిన్ని వివరాలు

త్వరలో మరిన్ని వివరాలు

‘మిస్టర్ ఇండియా-2' చిత్రం ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించబోతున్నట్లు సమాచారం.

English summary
Remember Anil Kapoor and Sridevi's hit movie, Mr India? After a decade, the sequel of the iconic movie is on the cards and Sridevi will be a part of it. Earlier, there were reports that Anil will bring his son Harshvardhan Kapoor in Mr India 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu