Just In
- 26 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
న్యూ బాస్ ఆప్ ది మాస్..టైటిల్ క్లాస్...పోస్టర్ మాస్...!?
ఇండస్ట్రీలొకొచ్చిన ప్రతీ హీరో మాస్ ని ఎట్రాక్ట్ చేయడమెలాగా... అని తంటాలు పడుతుంటారు. స్టార్ హీరోగా ఎదగాలన్నా... భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ కుమ్మేయాలన్నా... రికార్డులు బద్దలు కొట్టాలన్నా... మాస్ హీరోగా మారాల్సిందే. అందుకే హీరోలు మాస్ ఇమేజ్ తెగ ట్రై చేస్తుంటారు. ఇప్పుడు హీరో మంచు మనోజ్ సైతం మాస్ ప్రేక్షకులకు గాలమేసేందుకు చాలా కష్టపడుతున్నాడు.
మంచు మనోజ్, కృతికర్బందా కర్భంధ జంటగా తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ నోకియా. అని దర్శకత్వంలో డిఎస్ రావు నిర్మాత. సనాఖాన్ మరొక ముఖ్య పాత్రలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న మిస్టర్ నోకియా సినిమా టైటిల్ క్లాస్ గా ఉన్నా పోస్టర్స్ లోని ఫొటోలు మాత్రం మాస్ గా ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ కు 'నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్' అంటూ.... ట్యాగ్ లైన్ తగిలించారు. అంతేకాదు లేటేస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో 'న్యూ బాస్ ఆఫ్ ది మాస్' అంటూ... మాస్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా రెడీ చేశారు. ఈ పోస్టర్స్ ని మనోజ్ దగ్గరుండి తయారు చేయిస్తున్నాడట.
మాస్ ఆడియోన్స్ ఫాలోయింగ్ పెంచుకునేందుకే ఇదంతా అని స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా... ఈ సినిమా పోస్టర్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మనోజ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మనోజ్ డూప్ లేకుండా నటించాడట. విభిన్నకథా చిత్రాలను ఎంచుకుంటూ మంచి పాత్రలు పోషిస్తున్న మనోజ్ మిస్టర్ నోకియా సినిమాతో విజయం సాధించడానికి రెడీ అవుతున్నాడు. మరి సినిమాలో విషయమెంతుందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ మధ్యే పిల్లజమీందార్ తో సూపర్ హిట్ కొట్టిన డిఎస్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో మరో విజయం సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు.