బాహుబలి ప్రీక్వెల్ ‘రైజ్ ఆఫ్ శివగామి’: శివగామి పాత్రలో ఎవరో తేలిపోయింది!
Recommended Video

భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనం 'బాహుబలి' ప్రాజెక్ట్. 'బాహుబలి-ది బిగినింగ్', 'బాహుబలి2- దికంక్లూజన్' టైటిల్స్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల చేయగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్లు వసూలు చేసింది.
త్వరలో 'బాహుబలి' ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇది సినిమా రూపంలో కాకుండా వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఛానల్ 'నెట్‌ఫ్లిక్స్'... ఆర్కామీడియావర్క్స్, రాజమౌళితో కలిసి ఈ వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు.

‘ది రైజ్ ఆఫ్ శివగామి'
‘ది రైజ్ ఆఫ్ శివగామి' పేరుతో ఈ ప్రీక్వెల్ రూపొందబోతోంది. అయితే అరమేంద్ర బాహుబలి పుట్టుక ముందు జరిగిన కథ ఏమిటి? మాహిష్మతి రాజ్యం అంత బలమైన రాజ్యంగా ఎలా ఎదిగింది? శివగామిదేవి ఎక్కడ పుట్టింది? ఎలా ఈ రాజ్యానికి కోడలిగా వచ్చింది. అంత పెద్ద రాజ్యాన్ని తన కను సైగతో ఎలా కంట్రోల్ చేసింది అనే కథతో... ఈ వెబ్ సిరీస్ రాబోతోంది.

శివగామి పాత్రకు ఆ టీవీ నటి ఖరారు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... ఇందులో శివగామి పాత్రకు ప్రముఖ హిందీ టీవీ నటి మృణాళి ఠాకూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె స్పెషల్ యాక్టింగ్ వర్క్ షాపులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.

దేవాకట్ట, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం
‘ది రైజ్ ఆఫ్ శివగామి' వెబ్ సిరీస్‌కు తెలుగు డైరెక్టర్స్ దేవాకట్ట, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించబోతున్నారు. రెండు సీజన్లు, మొత్తం 9 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
ఆ పుస్తకం ఆధారంగానే
ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి' పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది. రాజమౌళితో పాటు ఆర్కా మీడియా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు. వీరితో పాటు ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు కూడా ఈ ప్రీక్వెల్‌కు పని చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











