»   » హీరోయిన్ త్రిషను అభినందించిన ధోనీ దంపతులు

హీరోయిన్ త్రిషను అభినందించిన ధోనీ దంపతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టీమిండియా డైనమిక్ కెప్టెన్ ధోని, అతని భార్య సాక్షి హీరోయిన్ త్రిషను అభినందించారు. ఇంతకీ వారు అభినందించేంత మంచి పని త్రిష ఏం చేసిందని అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. త్రిషకి మూగ జీవాలంటే మహాఇష్టం. ఆ ఇష్టంతోనే హీరోయిన్ త్రిష యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ తో కలిసి కొంత కాలంగా పని చేస్తోంది.

రోడ్లపై తిరిగే అనాధ కుక్కలను దత్తత తీసుకోండి అంటూ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రచారం మొదలు పెట్టింది. త్రిష చేస్తున్న ఈ మంచి పనికి ధోనీ, అతని భార్య సాక్షి కూడా ఆకర్షితులయ్యారు. ఇటీవల రోడ్డుపై ఓ కుక్క కనిపిస్తే దాన్ని చేరదీసారట. మాకు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం త్రిషే...మూగ జీవాల కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయం అంటూ ప్రశంసించారు.

జంతువులపై ప్రేమతో హీరోయిన్ త్రిష యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తుంది. ఇందులో భాగంగా ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన ఓ వెల్ఫేర్ కార్యక్రమానికి అమలతో కలిసి హాజరయ్యారు. జంతువులను దత్తత తీసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్స్ మరియు మెయిల్ ఐడీల ద్వారా సంప్రదించండి సదరు ఫౌండేషన్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్లు అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది త్రిష.

త్రిష సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం త్రిష తెలుగులో 'రమ్' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన త్రిషకుఈ మధ్య అవకాశాలు బొత్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో తనదైన గుర్తింపు కోసం వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది.

English summary
Trisha is a great lover of animals and she has a plenty of animals which are thrown away , she is been protecting them from many days. Trisha mentioned in her Tweets to protect animals that are found on road.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu