For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూ ఎన్టీఆర్ పై ఎమ్ఎస్ రెడ్డిగారి పుస్తకంలో చేసిన విమర్శ ఏమిటి

  By Srikanya
  |

  ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రెడ్డి గారు తన ఆత్మ కథలో జూ.ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. జూ.ఎన్టీఆర్ ప్రారంభం రోజుల్లో ఆయన నిర్మించిన రామాయణం చిత్రం లో రాముడుగా చేసాడు. ఎమ్.ఎస్ రెడ్డిగారు ఆ పుస్తకంలో రాసిన మాటలు యధాతధంగా...మీ కోసం...

  ''...ఇక నా రామాయణ రాముణ్ణి గురించి చెప్తాను. 'జూరామాయణం" నిర్మాణంలో ఉండగా తాతయ్యా! మీరు నాలుగయిదేళ్లు ఓపిక పట్టండి. అప్పటికి నేను పూర్తిస్థాయి కధానాయకుడిగా ఎదుగుతాను. మొదటి పిక్చర్ మన బ్యానర్లోనే చేస్తాను. ఈలోగా మంచి టీనేజ్ లవ్ సబ్జెక్టు తయారు చేయించండన్నాడు. నేనతని మాట నమ్మాను. అతను కథానాయకుడుగా ఎదిగాక మొదటి పిక్చర్ రామోజీరావుగారి బ్యానర్లో చేస్తున్నాడని పేపర్లో చదివాను. వెంటనే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి నాకిచ్చిన మాట మర్చిపోయావా బాబూ అన్నాను. లేదు తాతయ్యా! ఈ పిక్చర్ మా డాడీ రెకమెండేషన్‌తో ఒప్పుకున్నాను. తర్వాత పిక్చర్ మనదే అన్నాడు అతి వినయం ప్రదర్శిస్తూ తారక్. కానీ తర్వాత అతను వరసగా వివిధ బ్యానర్లలో నటిస్తూనే ఉన్నాడు. నేను ఆత్మను చంపుకుని అతని చుట్టు తిరగసాగాను. ఒకరోజు అతను అయిన ఆలస్యమెలాగూ అయింది. సెంటిమెంటల్‌గా మీకు తొమ్మిదో పిక్చర్ చేయాలనుకుంటున్నాను. డైరక్టర్ ఎవర్నది తర్వాత చెప్తానన్నాడు. అతను ఎన్నిమార్లు ఆడి తప్పుతున్నా నేను మాత్రం అతనే్న దృష్టిలో వుంచుకుని మంచి కథ రూపొందించాను.

  చిన్న హీరోగా నా 'రామాయణం"లో నటించి పెద్ద హీరోగా ఎదిగిన తారక్ ఒకరోజు కథ వినేందుకు శబ్దాలయకు వచ్చాడు. చూడు బాబు! ఇప్పటికీ నా ఆఫీసు ముందు రామాయణ రాముడుగా నీ ఫోటోనే ఉంది. నీకు ఇన్నాళ్లకు నామీద దయకలిగింది అన్నాను. మీరు జరిగిపోయిన దాన్ని గురించి ఏకరవు పెట్టకుండా ముందు కథ మొదలుపెట్టండి అన్నాడతను.నేనలాగే మొదలుపెట్టాను. అతను మాటి మాటికీ మొలక మీసం దువ్వుకుంటూ కథ వింటున్నాడు. ఇంతలో కళాబంధు డా.టి.సుబ్బరామిరెడ్డిగారు నాతో ఏదో మాట్లాడాలని శబ్దాలయకు వచ్చాడు. బాబూ! నువ్వు ఐదు నిముషాలు పక్క రూమ్‌లో కూర్చో. నేను సుబ్బరామిరెడ్డిగారితో మాట్లాడి వీలైనంత త్వరగా పంపించి వేస్తాను. తర్వాత మిగతా కథ కంటిన్యూ చేద్దామన్నాను. ఓకే...ఓకే అంటూ బైటకెళ్లాడు తారక్.

  సుబ్బరామిరెడ్డిగారు వెళ్లిపోగానే నేను మేనేజర్‌ను పిలిచి తారక్‌ను రమ్మను అన్నాను. అఫ్టరాల్ సుబ్బరామిరెడ్డికోసం నన్ను బైట కూర్చోమంటాడా! నా ముందు సుబ్బరామిరెడ్డెంత? చూపిస్తాను నా తడాఖా! అంటూ విసురుగా కారెక్కి వెళ్లిపోయాడని మేనేజర్ చెప్పాడు. దాంతో అహంకారంలో తారక్ గుణశేఖర్‌కు తీసిపోడని తెలుసుకుని నాలో నేను కుమిలిపోయాను..". అదీ పెద్దాయన్ని బాధ పెట్టిన వైనం.

  English summary
  Veteran producer and lyricist M.S. Reddy, popularly known as Mallemala, lashed out at actor Jr. NTR, stating on his autobiography 'Idee Naa Katha' that Jr. NTR is a most selfish person who doesn’t keep his word.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X