»   » సంక్రాంతి నుండి కొణిదెల నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’

సంక్రాంతి నుండి కొణిదెల నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్లో యూట్యూబ్ సీరీస్ ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాల రూపొందిస్తున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో ఆ మధ్య ఓ యూట్యూబ్ సిరీస్ ప్రారంభడం, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి హడావుడి చేసారు.

ఈ యూట్యూబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 15 నుండి ప్రసారం కానుంది. ఇందులోని క్యారెక్టర్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని, ఈ సీరిస్ అందరికీ నచ్చుతుందని నిహారిక తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సీరీస్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.

Mudda Pappu Avakay 1st episode from Jan 15th

‘ముద్దపప్పు ఆవకాయ'లో నిహారిక ఆశా పాత్రలో మెయిల్ రోల్ చేస్తోంది. అర్జున్ అనే పాత్రలో మరొక వ్యక్తి నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అమృతం సీరియల్ తరహాలో ‘ముద్ద పప్పు ఆవకాయ' అనేది ఎంటర్టెన్మెంట్ సిరీస్ అని తెలుస్తోంది. ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా ఎంటర్టెన్మెంట్ పంచే విధంగా దీన్ని డిజైన్ చేసారు.

మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివిన నిహారిక... యాంకర్ గా తన సత్తాచాటడంతో పాటు యూనిక్ ఎక్స్‌పర్మెంటుతో ప్రొడక్షన్ రంగంలోకి దిగుతోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో నిహారిక కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది సినిమాలు నిర్మించేంత పెద్ద ప్రొడక్షన్ సంస్థ కాదు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ మీద యూట్యూబ్ సిరీస్‌ ప్రారంభించింది నిహారిక. తన క్లోజ్ ఫ్రెండ్ ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్దపప్పు ఆవకాయ' యూట్యూబ్ సిరీస్ రూపొందించారు.

English summary
"Family, friends and celebrations, this festive season has a lot more to offer. The 1st episode of ‪#‎MuddaPappuAvakay‬ is going to be out on 15th January." Niharika Konidela said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu