»   » ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ మళ్లీ

ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ మళ్లీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అంటూ ముమైత్ ఖాన్ చేసిన డాన్స్ ఒక ఊపు ఊపింది. 2006లో వచ్చిన పోకిరి తర్వాత ఆమె ఫుల్ బిజీ అయ్యిపోయింది. ఓ ఐదేళ్లు పాటు కంటిన్యూగా తెలుగువారిని అలరించింది. ఎన్నో చిత్రాల్లో ఐటం లు చేసింది..సోలో హీరోయిన్ గా చేసింది. అయితే గత కొంతకాలంగా ఆమె ఫేడవుట్ అయ్యింది. అయితే బాలకృష్ణ తాజా చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగ్ చేయబోతోంది.

తమన్ సంగీతం సమకూర్చిన పాటకు ఆమె డాన్స్ చేయనుంది. డిసెంబర్ 23 నుంచి అంటే ఈ రోజు నుంచి హైదరాబాద్ లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాతో మళ్లీ బిజీ అవుతానని భావిస్తోంది. చూడాలి మరి ఏ మేరకు ఆమె అలరిస్తుందో.


Mumaith Khan doing item song for Dictator

శ్రీవాస్‌ మాట్లాడుతూ.... ‘‘లౌక్యం' తర్వాత బాలకృష్ణగారిని కలిశాను. ‘మనం ఒక సినిమా చేద్దాం సర్‌' అంటే వెంటనే ఓకే చెప్పేశారు. ఆయన నా మీద ఉంచిన నమ్మకమది. బాలకృష్ణతో పని చేయడం కష్టం అంటుంటారు. కానీ ఆయనతో పని చేసి చెప్తున్నా.. ఆయనతో పనిచేయడం చాలా సులభం. ఆయన దగ్గర అబద్దం చెప్పినా, నిజం దాచినా నచ్చదు. తన చుట్టుపక్కల వాళ్లూ అలాంటోళ్లు ఉండాలని కోరుకుంటారు. నేను ఆయనలాగే ఉన్నాను. అందుకే ఆయనతో పని చేయడం సులభమైపోయింది అన్నారు.


నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Mumaith Khan will be doing for an item number in Balakrishna starrer Dictator.
Please Wait while comments are loading...