»   » సిగరెట్,వైన్ తప్ప డ్రగ్స్ తెలియదు: మళ్ళీ బిగ్‌బాస్ హౌస్ లోకి ఐటమ్ గర్ల్ ముమైత్‌?

సిగరెట్,వైన్ తప్ప డ్రగ్స్ తెలియదు: మళ్ళీ బిగ్‌బాస్ హౌస్ లోకి ఐటమ్ గర్ల్ ముమైత్‌?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన నటి ముమైత్‌ ఖాన్‌ వెంట బిగ్‌బాస్‌ షో నిర్వహకులు వచ్చారు. ముమైత్‌ సిట్‌ కార్యాలయంలోకి ప్రవేశించేంత వరకు, విచారణ అనంతరం సిట్‌ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే నిర్వహకులు ఆమె వెంట ఉన్నారు. బిగ్‌బాస్‌ షో నిబంధనల ప్రకారం 70 రోజుల వరకు షోలో పాల్గొనే వారి పూర్తిబాధ్యత నిర్వహకులదే. సిట్‌ విచారణ నేపథ్యంలో ప్రత్యేక అనుమతితో ఆమెను అధికారుల ఎదుట విచారణకు హాజరుపరిచారు.

సిగరెట్ తాగటం, వైన్ తీసుకోవటం తప్ప తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేనట్టు ముమైత్ చెప్పిందని సమాచారం. డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న ఆమె గురువారం సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

Mumaith khan re join to bigg boss team

పుణె సమీపంలోని సెట్‌లో ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో జరుగుతోంది. సిట్‌ విచారణ నేపథ్యంలో బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ముమైత్‌ స్థానికంగా ఉన్న ఓ స్టార్‌ హోటల్‌లో బసచేశారు.హోటల్‌ నుంచి గురువారం ఉదయం 10 గంటలకు నేరుగా సిట్‌ కార్యాలయానికి ఇన్నోవా కారులో చేరుకుంది.

కారు దిగిన తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించి, విచారణ అనంతరం భద్రతా సిబ్బంది నుంచి కారు వద్దకు షో నిర్వహకులు ముమైత్‌ను వెంటతెచ్చారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిట్‌ అధికారులు ముమైత్‌ను విచారించారు. బిగ్‌ బాస్‌ రూల్స్‌ ఫాలో అవుతున్నందున విచారణ అనంతరం ముమైత్‌ మీడియాతో మాట్లాడకుండా ఎవ్రి థింగ్‌ ఈజ్‌ ఫైన్‌ అంటూ లోపలకు వెళ్లిపోయింది.

విచారణ పూర్తి కాగానే ముమైత్ డైరెక్ట్ గా పూణేలోని బిగ్ బాస్ హౌజ్ కే వెళ్ళినట్టు సమాచారం. సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా ముమైత్ తో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారని వార్తలు రాగా, విచారణ తర్వాత వారు ఆమెని ఎవరితో కలవనీయకుండా డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌజ్ కే తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే స్పెషల్ పర్మిషన్ తో ముమైత్ బయటకు రాగా, ఆమెని హౌజ్ లోకి వెళ్ళేందుకు అనుమతినిచ్చారు. మళ్ళీ టీంతో కలిసినందుకు కో పార్టిసిపెంట్స్ హ్యపీగా ఫీలవుతున్నారట.

English summary
Item girl Mumait Khan Who is quit te Bigg Boss for drug quiz, Re joined with her Shoe Team again
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu