For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీవీ నటి మృతి వెనక అసలు కథ..భర్త అరెస్టు

  By Srikanya
  |

  Hema Sri
  బెంగళూరు: అనుమానస్పద రీతిలో మంగళవారం రాత్రి మరణించిన బుల్లితెర నటి హేమాశ్రీ (26) భౌతికకాయానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. హేమాశ్రీ మృతి వెనక అసలు కథని పోలీసులు,మీడియా తవ్వుతున్నారు. ఆమె భర్త సురేంద్రని అరెస్టు చేసారు. ఆయన్ని ప్రశ్నించటానికే అరస్ట్ డిసిపి(నార్త్) హెచ్.ఎస్ రవీన అన్నారు. అక్టోబర్ 20 వరకూ పోలీస్ కష్టడీలో ఉంచుతారు. హేమశ్రీ స్వస్థలం తుమకూరు. ఆమె తల్లిదండ్రులు నీలావతి- నాగరాజు. హేమాశ్రీ గత విధానసభ ఎన్నికల్లో తుమకూరు రూరల్‌ నుంచీ జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో ఆమె భర్త సురేంద్ర బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిల్చారు. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. సురేంద్రకు హేమాశ్రీ తండ్రి నాగరాజుతో పరిచయం ఉంది.

  దీంతో సురేంద్రను పెళ్లి చేసుకోవాలని హేమాశ్రీపై తండ్రి ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోలేదు. తీవ్ర ఒత్తిళ్లు రావడంతో గత్యంతరం లేక అంగీకరించింది. గత ఏడాది జూన్‌ 24వ తేదీన సురేంద్రతో తిరుపతిలో పెళ్లి జరిగింది. ఆ సమయంలో సురేంద్రకు 35 ఏళ్లని నమ్మించారని, కానీ ఆయనకు 48 ఏళ్లు ఉన్నాయని హేమాశ్రీ తెలుసుకుంది. వివాహమైన రెండు రోజుల్లో అంటే జూన్‌ 26వ తేదీ ఇదే విషయాన్ని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  భర్త, తన ఇతర కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఆమె స్వదస్తూరితో రాసి ఫిర్యాదు చేశారు. వివాహ జీవితం కూడా సాఫీగా సాగడం లేదని ఆమె తన సహ కళాకారులతో గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. అయితే అల్లుడు, కుమార్తె చక్కని జీవితాన్ని సాగిస్తున్నారని, వారి మధ్య విభేదాలు లేవని తండ్రి నాగరాజు మీడియాతో చెప్పారు. హెబ్బాళ పోలీసుల కథనం వేరుగా ఉంది. ఆసుపత్రికి తీసుకురావటానికి ఎనిమిది గంటల ముందే ఆమె మృతి చెందిందని బాప్టిస్ట్‌ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సురేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

  భర్త ఏమన్నారంటే... 'చెన్నైలో ఒక తమిళ ధారావాహిక చిత్రీకరణ పూర్తి చేసుకుని బస్సులో బెంగళూరుకు వస్తుండగా హేమాశ్రీకి వాంతులయ్యాయి. బెంగళూరు చేరుకున్న తరువాత చెన్నమ్మనకెరె అచ్చుకట్టులోని ఇంట్లో కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాత అనంతపురం వెళ్లేందుకు కారులో బయలుదేరాం. నగర శివార్లకు చేరుకున్న తరువాత ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం బాప్టిస్ట్‌ ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించానని' హేమాశ్రీ భర్త సురేంద్రబాబు (48) పోలీసులకు తెలిపాడు.

  సుమనహళ్లిలోని విద్యుత్‌ స్మశాన వాటిక బుల్లితెర నటీ నటులు, సాంకేతిక వర్గ ప్రతినిధులు, కుటుంబ సభ్యుల ఆక్రందనలతో నిండిపోయింది. బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో ఉన్న హేమాశ్రీ మృతదేహాన్ని బుధవారం ఉదయం 5 గంటలకు విక్టోరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల వరకు ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు రాలేదు. బుల్లితెర నటులు మాత్రమే అక్కడ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తిచేశారు. గురువారం సాయంత్రానికి నివేదిక వస్తుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముక్కుపైన, కడుపులో గాయాలున్నాయని, జీర్ణాశయంలో నల్లని ద్రవం ఉందని తేలింది. ఈ నమూనాల్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆమెది అనుమానాస్పద మరణమని వైద్యులు స్పష్టంచేశారని పోలీసులు తెలిపారు.

  ఒక ప్రైవేటు ఛానల్‌లో వ్యాఖ్యాతగా జీవితాన్ని మొదలుపెట్టిన హేమాశ్రీ వీరపరంపర, విష్ణుసేన, వర్ష, జిందగీ, కీర్తి తదితర చిత్రాల్లో నటించారు. పలు కన్నడ సీరియళ్లలో హీరోయిన్ పాత్రల్ని పోషించారు. కొద్దికాలంలో తమిళ ధారావాహికల్లో కూడా పాత్రల్ని పోషిస్తూ బిజీగా మారారు. తన కెరీర్‌ ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడే అనుమానస్పద రీతిలో అందరికీ దూరమయ్యారు.

  English summary
  The Hebbal police on Wednesday arrested Surendra Babu, 52, a JD(S) leader in connection with the mysterious death of his wife and Kannada TV serial actress Hema Sri, 32, on Tuesday. He has been remanded in police custody till October 20. DCP (North) H S Revanna said the actress’s father Nagaraj had filed a case against Babu suspecting his role in the death. “A murder case has been registered against Babu and we are questioning him,” Revanna said
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X