»   » ఒక్క ఫైట్ సీన్ కోసం మూడుకోట్లా..!? మహేష్ మురుగ దాస్ సినిమా కోసం

ఒక్క ఫైట్ సీన్ కోసం మూడుకోట్లా..!? మహేష్ మురుగ దాస్ సినిమా కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో అసలు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైట్లను చూడలేదు. శ్రీమంతుడు వంటి సినిమాల్లో ఫైటింగులు చేసినా కూడా అవి చాలా చిన్నవే. ఇక బ్రహ్మోత్సవంలో అలాంటివేం లేదు. కాబట్టి అభిమానులు కూడా యాక్షన్ హీరోగా పోకిరి తన దూకుడు చూపిస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారు. వారందరి కోరిక తీర్చడానికి దర్శకుడు మురుగుదాస్ కాస్త గాట్టిగానే కష్టపడుతున్నాడు మరి.

మహేష్ మురుగదాస్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మురుగ దాస్ గతం లో తెలుగు లో దర్శకత్వం వహించిన స్టాలిన్ నిరాశ పరిచిన తర్వాత తమిళ్ లో తుపాకి, కత్తి సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నాడు. సోనాక్షి ప్రధాన పాత్ర లో బాలివుడ్ లో వచ్చిన అకీరా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఐతే ఎప్పటి నుంచో మహేష్ మురుగ దాస్ కాంబినెషన్ వినపడుతున్నప్పటికి, మొత్తానికి ఈ సంవత్సరం పట్టాలు ఎక్కింది.

Murugadas to shoot a costly car chase sequence with Mahesh Babu

ఇది మహేష్ కెరీర్ లో లాండ్ మార్క్ ఫిలిం అవుతుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు గా తమిళ్ మళయాళం, హిందీ లో కూడా ఏక కాలం లో రిలీజ్ చేసే ఆలోచనల ఉందట చిత్ర బృందం. ఇది కనుక జరిగితే బాలివుడ్ హీరో లా ఉండే మహేష్ బాలివుడ్ లో పాగా వెయ్యటం తో పాటు తమిళ్, మళయాళం లో తనకంటు మార్కెట్ సృష్టించుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

బడ్జెట్ 100 కోట్లకు దగ్గరలో ఉందని తెలిసిందే. రెండు భాషల్లో చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఈ బడ్జెట్ ను ఈజీగా రికవర్ చేయచ్చన్నది మురుగదాస్ ఆలోచన. ప్రస్తుతం చెన్నయ్ లోని ఒక స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్-మురుగుదాస్ సినిమా త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి రానుంది. ఈ సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ ఫైటింగ్ కమ్ చేజ్ సీన్ ను దాదాపు 3 కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్నారట. వివిధ కార్ చేజులు.. వాటి పక్కనే బోటులో మరో చేజ్.. మొత్తంగా ఒక పెద్ద ఫైటింగ్.. వాటిలో ఆసక్తిగొలిపే విజువల్ ఎఫెక్ట్స్.. అన్నీ కలుపుకుని ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చవుతుంది.

English summary
Superstar Mahesh is getting ready to take part in a 12 day car chase sequence that will be costing the makers nearly 3 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu