»   »  సోనాక్షితో మురుగదాస్ సినిమా, ఆమె తండ్రి కూడా...

సోనాక్షితో మురుగదాస్ సినిమా, ఆమె తండ్రి కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్.

ఈ వారంలోనే ఈచిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో సోనాక్షి తండ్రి శతృజ్ఞ సిన్హా ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు.

 Murugadoss's next with Sonakshi set to roll

‘ఈ సినిమా మార్చి 14న ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో సోనాక్షి ఫాదర్ కూడా నటిస్తున్నారు. ఆయన చేస్తున్న పాత్ర చిన్నదే అయినా సినిమాకు ఎంతో ముఖ్యమైన పాత్ర' అని ఆ చిత్రానికి సంబంధించిన యూనిట్ సభ్యులు వెల్లడించారు.

ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మిస్తోంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మౌనగురు' చిత్రానికి ఇది రీమేక్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Filmmaker A.R. Murugadoss's yet-untitled Hindi outing, an action thriller with Sonakshi Sinha, is set to go on the floors this week. The film will also feature veteran actor Shatrugan Sinha in an important role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu