twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈ జనరేషన్లో జూ ఎన్టీఆర్ ఒక్కడే, ముట్టుకుంటే మాడి మసైపోతాం’

    |

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, లిరిక్స్ రాసిన సిరాశ్రీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ గురించిన ప్రస్తావనరాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ మాలిక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే నడిచే ఎనర్జీ అంటూ వ్యాఖ్యానించారు.

    యంగ్ టైగర్ ఎనర్జీ ఏ స్థాయిలో ఉంటుందో మ్యూజిక్ కళ్యాణ్ మాలిక్ వివరించిన తీరు అభిమానులకు తెగ నచ్చేసింది. ''ఎన్టీఆర్ అంటే మెరుపుతీగ. ఆయన నడిచే ఎలక్ట్రిసిటీ. దాన్ని చూసి అనందించాలే తప్ప పట్టుకోవాలని చూస్తే మాడిమసైపోతాం. నిలువెత్తున కనిపించే ఒక ఎనర్జిటిక్ సింబల్.'' అని చెప్పుకొచ్చారు.

    ఎన్టీఆర్‌తో సినిమా అంటే భయం

    ఎన్టీఆర్‌తో సినిమా అంటే భయం

    ‘‘ఆయన సినిమాకు చేసే అవకాశం వచ్చినా చేయడం చాలా కష్టం. అవకాశం వస్తే బావుండు అని సంబరపడతాం కానీ.. కొన్ని సినిమాలు వస్తే భయం వేస్తుంది. అలా భయం వేసే సినిమాల్లో జూ ఎన్టీఆర్ మూవీ ఉంటుంది.'' అంటూ కళ్యాణి మాలిక్ వ్యాఖ్యానించారు.

    ఈ జనరేషన్లో జూ ఎన్టీఆర్ ఒక్కడే

    ఈ జనరేషన్లో జూ ఎన్టీఆర్ ఒక్కడే

    ఈ జనరేషన్లో తెలుగు భాషను ఏ స్థాయిలో రాసినా గొప్పగా ఉచ్చరించే హీరో ఎన్టీఆర్ మాత్రమే అని లిరిక్ రైటర్ సిరాశ్రీ వ్యాఖ్యానించారు. ‘ఎలాంటి తెలుగు డైలాగులనైనా ఆయన అద్భుతంగా చెప్పగలడు, అలాంటి హీరో మరొరు ఇండస్ట్రీలో లేరని నా ఫీలింగ్' అని వ్యాఖ్యానించారు.

    ఆర్జీవీ గురించి సిరాశ్రీ కవిత

    ఆర్జీవీ గురించి సిరాశ్రీ కవిత

    • ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని మేఘాలపైకి వెక్కి కూర్చోగలడు
    • అల్లంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు
    • సరిగ్గా నేలను తాకే సమయానికి క్షణాల్లో రెక్కలు మొలిపించుకుని రివ్వున పైకి ఎగరగలడు
    • భోగిమంట అంత సంబరంగా చితి మంట వేసుకుని దూకేయగలడు
    • అంతలోనే ఫినిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి లేచి వచ్చేయగలడు
    • అసాంఘీక శక్తిగా కనిపిస్తూ మెదళ్లలో విస్పోటనం చేయగలడు
    • వెంటనే అవతార మూర్తిలా మారి జ్ఞాన ప్రభోదం చేయగలడు
    • శివుడిలా దెయ్యాలతో భూతాలతో ఆడుకోగలడు. ఇంద్రుడిలా ఓడ్కా అమృతం సేవిస్తూ సేద తీరగలడు
    • తత్వాన్ని దిగంబరంగా చూపించగలడు. ఛీఛీ అన్న నోటితోనే వారెవా అనిపించుకోగలడు
    • తన జీవితాన్ని తాను తప్ప ఇంకెవరినీ శాసించనీయడు. ఏ మనసుకు లొంగడు, ఆలోచనకు అందడు.
    • ఎవడు ఏమనుకున్నా ఎవడెటు పోయినా స్వేచ్ఛను గుండె నిండా పీలుస్తూ స్వాతంత్రాన్ని నరనరాన అనుభవిస్తూ
    • సమాజాన్ని ధిక్కరిస్తూ తన జవాబుతో అజ్ఞానం తొక్కతీస్తూ తన తెలివితో ప్రపంచాన్ని వెక్కిస్తూ
    • తనను అంచనా వేసేవారి గుడ్లు తేలేస్తూ జీవిస్తున్న ఒకే ఒక్క జీవి ఆర్జీవీ
    • ఆర్జీవీ సినిమా పాటల్లా ఉండకూడదని చెప్పారు

      ఆర్జీవీ సినిమా పాటల్లా ఉండకూడదని చెప్పారు

      ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రామ్ గోపాల్ వర్మ అనుకున్న తర్వాత మ్యూజిక్ కూడా బెంచ్ మార్కులా ఉండాలని చెప్పారు. ఇది ఆర్జీవీ సినిమా పాటల్లా ఉండకూడదని మరీ మరీ చెప్పారు. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే లక్ష్మీస్ ఎన్టీఆర్ మ్యూజిక్ అంత బాగా, యూనిక్‌గా వచ్చిందని... సిరాశ్రీ తెలిపారు.

    English summary
    "Jr NTR Very energetic person. He can Deliver awesome Telugu Dialogues. There is no other hero like NTR in this industry." Tollywood Music Director Kalyani Malik and Sirasri About Jr Ntr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X