»   »  కంగ్రాట్స్: మణిశర్మ కొడుకు లాంచ్ అయ్యాడు

కంగ్రాట్స్: మణిశర్మ కొడుకు లాంచ్ అయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తన కుమారుడుని లాంచ్ చేస్తున్నారు. హీరోగానో, మరొకటిగానో కాకుండా ఆయన తనలాగే తన కుమారుడు కూడా సంగీతంలో రాణించాలని కోరుంటున్నారు. అందులో భాగంగానో మహతిని ఆయన లాంచ్ చేస్తున్నారు. నాగశౌర్య హీరోగా రూపొందుతున్న జాదూగాడు చిత్రం ద్వారా ఈ యువ సంగీత దర్శకుడు పరిచయం అవుతున్నారు. మీరు ఇక్కడ చూస్తున్న ఈ పోస్టర్ ని ఈ సందర్భంగా చిత్రం యూనిట్ విడుదల చేసింది. బెస్టాఫ్ లక్ మహతి. మీ తండ్రి గారి లాగే మీరు సంగీత దర్శకుడుగా ఉన్నత శిఖరాలు అథిరోహించాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

https://www.facebook.com/TeluguFilmibeat

చిత్రం విశేషాలకి వస్తే...

నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.వి.యన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘జాదూగాడు' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘చింతకాయల రవి' ఫేమ్‌ యోగేశ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జాతీయ టెలివిజన్‌ సీరియల్‌ ‘హర హర మహాదేవ'లో పార్వతి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సోనారిక ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు

. దర్శకుడు యోగేశ్‌ మాట్లాడుతూ ‘‘నాగశౌర్య పోషిస్తున్న పాత్ర అతని గత పాత్రలకు భిన్నంగా ఉంటుంది. మాస్‌ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునేవిధంగా అతని పాత్రను తీర్చిదిద్దాం'' అని చెప్పారు. షూటింగ్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయని నిర్మాత ప్రసాద్‌ తెలిపారు.

Music Director Mani Sharma's Son Launched!

‘‘పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ నెలలో పాటల్నీ, ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

కోట శ్రీనివాసరావు, అజయ్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేశ్‌, జాకిర్‌ హుస్సేన్‌, ఆశిశ్‌ విద్యార్థి, రవి కాలే, ప్రభాస్‌ శ్రీను, రాఘవ, అదుర్స్‌ రఘు, సత్య, ఫిష్‌ వెంకట్‌ తారాగణమైన ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

English summary
Mani Sharma's son Sagar Mahati is debuting as Music Director with 'Jadoogadu' starring Naga Shaurya and Sonarika.
Please Wait while comments are loading...