»   »  సంగీత స్వరం మూగబోయింది: విశ్వనాథన్ కన్నుమూత

సంగీత స్వరం మూగబోయింది: విశ్వనాథన్ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Music director Vishwanathan passes away

1928వ సంవత్సరం జూన్‌ 24న కేరళలోని పాలక్కాడ్‌ సమీపంలోని ఇలప్పులలో ఆయన జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్‌ సుబ్బరామన్‌తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. దేవదాసు సినిమాలోని జగమే మాయ బతుకే మాయ పాటను స్వరపర్చారు.

చండీరాణి, సిపాయి చెన్నయ్య తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈయన మృతి వార్త విని సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. :ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథన్‌ మృతిపై సినీరంగం నటీనటులు, సంగీత విద్వాంసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Music director Vishwanathan passes away

తెలుగు, తమిళ, మళయాల భాషల్లో 1200 చిత్రాలకు ఎంఎస్‌ విశ్వనాథన్‌ సంగీత దర్శకత్వం వహించారు. సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, మరో చరిత్ర, అంతులేని కథ, అందమైన అనుభవం, తెనాలి రామకృష్ణుడు, ఆకలిరాజ్యం, ఇది కథకాదు, రాము, సింహబలుడు తదితర చిత్రాలకు ఎంఎస్‌ సంగీత దర్శకత్వం వహించారు.

English summary
An eminent music director MS Vishwanathan passes away in Chennai hospital.
Please Wait while comments are loading...