twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవి శ్రీ ప్రసాద్ vs థమన్.. ఇద్దరిలో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో పోటీ అనేది నిత్యం ఉంటూనే ఉంటుంది. తెర వెనుక ఒకరికి వచ్చిన అవకాశం అనుకోకుండా వెంటనే మరొక చేతికి మారడం జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పోటీ నడుస్తోంది మాత్రమే సంగీత దర్శకుల మధ్యలోనే. టాప్ లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ - థమన్ ఒకరికి మించి మరొకరు మ్యూజిక్ వాయిస్తున్నారు. ఇక వీరిలో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

     దేవి శ్రీ ప్రసాద్ vs థమన్

    దేవి శ్రీ ప్రసాద్ vs థమన్

    మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అనేది ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఇన్ సైడ్ వార్ జరుగుతోంది. పైకి చెప్పకపోయినా కూడా టాప్ కంపోజర్స్ మధ్య పోటీతత్వం అనేది హై రేంజ్ లోనే ఉంటుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ - థమన్ మధ్యలో కూడా పోటీ తత్వం అనేది హై రేంజ్ లోనే ఉంది. ఒక ఇంటర్వ్యూలో థమన్ కూడా ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పాడు.

    తనవైపుకు తిప్పేసుకున్నాడు

    తనవైపుకు తిప్పేసుకున్నాడు

    నిజానికి థమన్ చాలాసార్లు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికి దేవి మాత్రం థమన్ మ్యూజిక్ పై ఎక్కువగా స్పందించింది లేదు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ దర్శకులకు బాగా క్లోజ్ అవుతూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా థమన్ ఒకప్పుడు దేవితో క్లోజ్ ఉండే దర్శకులను తనవైపుకు తిప్పేసుకున్నాడు.

    ఆ సినిమా తరువాత

    ఆ సినిమా తరువాత

    దేవి శ్రీ ప్రసాద్ కూడా మణిశర్మ స్కూల్ నుంచి వచ్చినవారే. ఇక రెమ్యునరేషన్ విషయంలో మొదటిసారి అందరికంటే ఎక్కువ తీసుకుంటూ వస్తున్నాడు. థమన్ కూడా మెల్లగా డోస్ పెంచుతున్నాడు. అల.. వైకుంఠపురములో హిట్టు అనంతరం ఒక్కసారిగా పారితోషికాన్ని డబుల్ చేసినట్లు టాక్ వచ్చింది.

    రెమ్యునరేషన్ ఎంతంటే..

    రెమ్యునరేషన్ ఎంతంటే..

    ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ 4కోట్లకు పైగా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక థమన్ ఇటీవల కంటిన్యూగా క్రాక్, వకీల్ సాబ్ వంటి సినిమాలతో మ్యూజికల్ గా కూడా హిట్టవ్వడంతో మరికొంత పెంచేసి మొత్తంగా 3కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

    చేతిలో ఎన్ని సినిమాలున్నాయంటే..

    చేతిలో ఎన్ని సినిమాలున్నాయంటే..

    వీరి నెక్స్ట్ లైనప్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. దేవిశ్రీప్రసాద్ పుష్ప, ఖిలాడి, రామ్ పోతినేని 19వ సినిమా, PSPK28, F3, వంటి విభిన్నమైన సినిమాలున్నాయి. ఇక థమన్ చేతిలో అఖిల్ ఏజెంట్, సర్కారు వారి పాట, టక్ జగదీష్, అఖండ వంటి సినిమాలున్నాయి. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు

    English summary
    Competition in the Tollywood industry is perpetual. The chance of someone coming behind the scenes inadvertently keeps switching to another hand immediately. Currently there is a lot of competition in the film industry only among music directors. Devi Sri Prasad - Thaman at the top is playing music one on top of the other. The issue of who gets the highest remuneration has now become a hot topic. Going into those details ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X