»   » 100వ సినిమా స్పెషల్ అంటూ బాలయ్య ప్రకటన

100వ సినిమా స్పెషల్ అంటూ బాలయ్య ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్' చిత్రంతో 97 సినిమాలు పూర్తి చేసుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో తన 98వ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. త్వరలో 100వ సినిమా చేయనున్న నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించి ప్రస్తావన తెచ్చారు బాలయ్య.

100వ సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ...' పూర్వ జన్మ సుకృతం వలన నందమూరి తారకరామారావు బిడ్డగా పుట్టాను. ఆయన ఈన్నో అద్భుతమైన పాత్రలు చేసి అందనంత ఎత్తుకి ఎదిగారు. నేను ఆయన బాటలోనే పయనిస్తున్నాను. నటుడిగా, బాధ్యతగల రాజకీయ నాయకుడిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందుకే మంత్రి పదవిని సైతం వదులుకున్నాను. నా 98వ సినిమా అందరినీ మెప్పించేలా ఉంటే, నా 100వ సినిమా మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది' అని తెలిపారు.

 "My 100 the film will be a very special one" Balakrishna said

ఈ సినిమా ఎవరితో చేస్తున్న విషయం బాలయ్య చెప్పక పోయినప్పటికీ.....రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఉంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ దేవరాయల సబ్జెక్టుతో ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్లోనే హైలెట్ అయ్యేలా ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.

బాలయ్య-సూత్యదేవా కాంబినేషన్లోవస్తున్న సినిమా విషయానికొస్తే...ఈ చిత్రాన్ని రుద్రపాటి ప్రేమలతా సమర్పణలో రుద్రపాటి రామారావు ఎస్ఎల్ వి బేనర్లో నిర్మిస్తున్నారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్ముల్యేగా ఎన్నికయిన తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

English summary

 "My 100 the film will be a very special one" Balakrishna said. Balakrishna has not revealed details about his plans but in the past, there was talk about a project with K. Raghavendra Rao on the subject of Sri Krishna Devaraya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu