»   » నా కల ఫలించలేదు.. ఆ డ్రీమ్ కూతురి ద్వారా..

నా కల ఫలించలేదు.. ఆ డ్రీమ్ కూతురి ద్వారా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలకు వారసులు కేవలం కొడుకులు మాత్రమే. మంచు లక్షి తదితరులు తప్ప తమ కూతుర్లను నటింపజేయడం తక్కువగానే కనిపిస్తుంది. సూపర్ స్టార్ క‌ృష్ణ కూతురు, ప్రిన్స్ మహేశ్ సోదరి మంజుల అప్పట్లో హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేపట్టింది. అయితే అభిమానుల నిరసన తెలుపడంతో పూర్తిస్థాయిలో హీరోయిన్‌గా కాకుండా షో లాంటి చిత్రాల్లో నటిగా ప్రూవ్ చేసుకొన్నారు.

తెరపైకి మంజుల కూతురు

తెరపైకి మంజుల కూతురు

‘తాజాగా మంజుల తన కూతురు జాన్వీని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంజులకు హీరోయిన్ కావాలని ఉండేదట.
పరిస్థితుల వల్ల పెద్ద కుటుంబాల అమ్మాయిలు సినిమా ఫీల్డ్ కు వచ్చేవారు కారు. కాబట్టి తను యాక్టింగ్ కు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది' అని మంజుల తెలిపింది.

నా కల ఫలించలేదు..

నా కల ఫలించలేదు..

నాకు హీరోయిన్ కావాలన్న తన కల ఫలించలేదు. ఆ డ్రీమ్‌ను నా కూతురు ద్వారా తీర్చుకుంటున్నాను అని మంజుల తెలిపారు. తాను హీరోయిన్ అయి ఉంటే అగ్రస్థానానికి చేరుకొనేదానిని. హీరోయిన్‌గా కాలేదనే బాధ ఏమాత్రం లేదని ఆమె పేర్కొన్నారు. తన దర్శకత్వంలో జాన్వీని సినిమా రంగానికి పరిచయం చేయాలనుకుంటున్నాను అని మంజుల వెల్లడించింది.

విన్నర్‌లో మహేశ్ మేనల్లుడు

విన్నర్‌లో మహేశ్ మేనల్లుడు

ఇప్పటికే మహేశ్ మేనల్లుడు, హీరో సుధీర్ కుమారుడు చరిత్ మానస్ విన్నర్ చిత్రం ద్వారా బాలనటుడిగా ప్రూవ్ చేసుకొన్నారు. విన్నర్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ చిన్నప్పటి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

వన్‌లో గౌతమ్ కృష్ణ

వన్‌లో గౌతమ్ కృష్ణ

ఇక మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ వన్ చిత్రంలో చిన్నప్పటి మహేశ్ బాబుగా కనిపించి మెప్పించారు. ఆ చిత్రంలో గౌతమ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

English summary
Mahesh Sister Manjula planning to introduce het daughter to film Industry. For that she preparing a script and going to direct it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu