»   » బిపాసా బసు ఫిట్ నెస్ డీవీడిలో ఏముంది?

బిపాసా బసు ఫిట్ నెస్ డీవీడిలో ఏముంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిట్‌ నెస్‌ కోసం ఏం చేయాలో చెబుతూ 25 నిమిషాల పాటు సాగే వీడియో డీవీడీని విడుదల చేశారు బిపాసా బసు. ఆమె దాన్ని ప్రమోట్ చేయటానకి మీడియాతో మాట్లాడుతూ...మహిళలను టార్గెట్‌ చేసుకునే ఈ డీవీడీని తయారు చేశానని ఆమె అంటున్నారు. అలాగే ఆ డీవిడీ గురించి మరిన్ని వివరాలు చెబుతూ -"నా స్నేహితుల్లో చాలామంది సోమరిపోతులు, ఒక్క క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండేవాళ్లు ఉన్నారు. ఈ రెండు వర్గాలవారు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. వ్యాయామలు చేయమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ పట్టించుకోలేదు. అందుకే డీవీడీ ద్వారా చెప్పాలనుకున్నాను. బలంగా, ఆరోగ్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. 'అన్నారు బిపాసా బసు. ఇక ఒంటి మీదకి అంత వయసొచ్చినట్లు కనిపించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి నేను విడుదల చేసిన డీవీడీ వైపు చూడండి మీకు పరిష్కారం లభిస్తుంది' అంటున్నారు బిపాసా బసు. ప్రస్తుతం ఆమె తెలుగు హీరో రాణా సరసన దమ్ మారో దమ్ అనే చిత్రంలో చేస్తోంది. రమేష్ సిప్పీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోవాలోని డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. హాలీవుడ్ హిట్ ట్రాఫిక్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu