»   » ఆ వార్త విని మా అమ్మ ఏడ్చింది.. అందుకే అతనికి దూరం.. బండ్ల గణేష్

ఆ వార్త విని మా అమ్మ ఏడ్చింది.. అందుకే అతనికి దూరం.. బండ్ల గణేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర వ్యక్తులకు బీనామీ అంటూ వచ్చిన వార్తలను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తోసిపుచ్చారు. రూ.300 కోట్ల పైగా ఆస్తులు, వ్యాపారాలున్నాయని స్పష్టం చేశారు. తన తండ్రి షాద్ నగర్ లో రూ.1.50 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించారని, ప్రస్తుతం కోట్లకు పడుగలెత్తామని ఆయన తెలిపారు.

తన వద్ద అంతమొత్తంలో డబ్బు ఉన్నప్పుడు ఒకరి బినామీగా వ్యవహరించాల్సిన అవసరం లేదని idreampost.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

My mother cried listening that rumour, says Bandla Ganesh

'బొత్స బినామీ అని వచ్చిన వార్త విని మా అమ్మ ఏడ్చింది. పేపర్ చూపించి ఎందిరా ఇది అని అడిగింది. దాంతో ఇక బొత్సను కలువను అని అమ్మతో చెప్పాను. ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత ఈ నెల 27న మళ్లీ బొత్స సత్యనారాయణను కలిశాను. అది కూడా బొత్స ఫోన్ చేసి తన కుమారుడికి వచ్చిన నాలుగు పెండ్లి సంబంధం గురించి చెప్పాడు. ఏ సంబంధం బాగుంటుందో చూసి చెప్పమని అడిగాడు'అని బండ్ల గణేష్ తెలిపారు.

English summary
Bandla Ganesh says that His family well established in shadnagar. And they gained huge money from various businesses. so no need of acting benami for anyone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu