»   » మార్చి 12న మై నేమ్‌ ఈజ్‌ అమృత!

మార్చి 12న మై నేమ్‌ ఈజ్‌ అమృత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కీర్తి, బేబి గాయత్రి, భానుచందర్‌, భానుప్రియ ముఖ్య తారాగణంగా ఆంథోని దర్శకత్వంలో యస్‌. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ట్యాక్స్‌ పతాకంపై వెంకట్‌ గౌని నిర్మిస్తున్న 'మై నేమ్‌ ఈజ్‌ అమృత" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్‌ గౌని మాట్లాడుతూ "ఓ విభిన్నమైన ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు జత చేసి రూపొందించిన చిత్రమిది. వినోదంతో పాటు చక్కని సందేశం కూడా వుంది.

కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇటీవలె విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. పాటల చిత్రీకరణ కూడా రిచ్‌గా వుంటుంది. భానుచందర్‌, భానుప్రియల పాత్రలు అందరి మనసులు కదిలిస్తాయి. జీవా కళ్లు చిదంబరం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి సంగీతాన్ని అందించారు. ఈనెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X