»   » మా అమ్మానాన్నా నాకు శీలం లేదు అనుకుంటున్నారంటూ చెప్పి షాక్ ఇచ్చింది

మా అమ్మానాన్నా నాకు శీలం లేదు అనుకుంటున్నారంటూ చెప్పి షాక్ ఇచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :బాలీవుడ్‌ బోల్డ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ తాజాగా శృంగారం గురించి, తన శీలం గురించి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ క్వీన్ కంగనా ఎప్పుడూ ఓపెన్‌గానే మాట్లాడుతూ ఉంటుందనే విషయం తెలిసినా..ఇంత ఓపెన్ గానా మాట్లాడుతుందని ఎవరూ ఊహించలేదు.

తన కొత్త సినిమా రంగూన్ విడదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి పలు రకాల ప్రశ్నలకి సమాధానం చెబుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్ ..

వివరాల్లోకి వెళితే..'రంగూన్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రేడియో ఇంటర్వ్యూలో కంగన ఈ వ్యాఖ్యలు చేసింది. తాను శీలవతిని కానని తన తల్లిదండ్రులు చాలాసార్లు అనుమానిస్తూ ఉంటారని ఓపెన్‌గా చెప్పేసింది. తన శీలం గురించి తన తల్లి తండ్రులు ఏమని అనుకుంటున్నారు అనే ప్రశ్నపై ఆమె ఓపెన్‌గా ఇలా చెప్పెయ్యడంతో అక్కడున్న వారందరు ఎంతో షాక్ అయ్యారట.

My parents are sad that I'm not a virgin: Kangana Ranaut

కంగనా మాట్లాడుతూ...'అందరి తల్లిదండ్రుల్లాగానే నా తల్లిదండ్రులూ నేను పెళ్లి అయ్యేంతవరకు శీలవతిలా ఉండాలని కోరుకుంటారు. కానీ, నా గత ఎఫైర్ల గురించి వాళ్లకు చెప్పేటప్పుడు.. వాళ్లలో కళ్లలో ఫీలింగ్‌ గమనిస్తే.. నేను శీలవతినని వారు అనుకోవట్లేదనే విషయం అర్థమవుతుంది. నా శీలం మీద వారికి అనుమానం ఉన్న విషయం నిజమే. అయితే ఆ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పరు' అని చెప్పింది కంగన.

అలాగే నిద్ర, శృంగారం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే కోరుకోమంటే.. తాను శృంగారానికే ఓటేస్తానని చెప్పింది. అయినా నిద్ర, శృంగారం.. రెండూ వేర్వేరు కాదని చెప్పుకొచ్చింది.

ఇక బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగూన్‌'. 2.47 గంటల నిడివి గల ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్ తెచ్చుకుంది.

పీరియాడిక్‌ చిత్రాలు తీయడంలో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దీనిని తెరకెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలిచారు. సైఫ్‌ అలీఖాన్‌.. షాహిద్‌ కపూర్‌.. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

జూలియా పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఓవైపు ప్రేమికుడు, మరోవైపు కాబోయే భర్త మధ్య నలిగిపోయే యువతిగా చక్కని నటనను కనబరిచింది.

1940ల్లో యాక్షన్‌ హీరోయిన్ గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచుకున్న ఫియర్‌లెస్‌ నదియా జీవితం ఆధారంగా కంగన పాత్రను రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫియర్‌లెస్‌ నదియా నటించిన 'హంటర్‌వాలి' చిత్రం నుంచి 'రంగూన్‌'లో 19 సన్నివేశాలు కాపీ కొట్టారంటూ 'హంటర్‌వాలి' నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఫియర్‌లెస్‌ నదియా తరహాలో కొరడా చేతపట్టి కంగన నటించిన 'బ్లడీహెల్‌' అనే పాటకు మంచి స్పందన వస్తోంది.

English summary
The Queen actress Kangana Ranaut said, "Definitely any parent would want their daughter to be a virgin as she's not married yet. As I talk about my past boyfriends, they always feel uncomfortable and sad that I'm not virgin though they don't express this it to me."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu