»   » నా భార్య పడక గదిలోకి రానివ్వడం లేదు.. బాలీవుడ్ స్టార్ కష్టాలు

నా భార్య పడక గదిలోకి రానివ్వడం లేదు.. బాలీవుడ్ స్టార్ కష్టాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తేజాబ్, హౌస్‌ఫుల్ లాంటి చిత్రాలతో విభిన్న నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడైన చంకీపాండే మరోసారి బేగంజాన్ చిత్రంలో విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మత కలహాలను ప్రేరేపించే దుష్టుడి పాత్రను చంకీ పాండే పోషిస్తున్నారు. దేశ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో బట్టతలతో కనిపించే పాత్రలో కనిపించనున్నారు.

గెటప్ చూసి షాక్ అయ్యారు

గెటప్ చూసి షాక్ అయ్యారు

నా గెటప్ చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. చాలా మంది గుర్తుపట్టలేదు. నా భార్య కూడా భయపడి పోయింది. పది, పదిహేను రోజులు పడక గదిలోకి రానివ్వలేదు. ఇంట్లోకి అపరిచిత వ్యక్తి దూరుతున్నాడనే అనుమానంతో నన్ను చూసి పెంపుడు కుక్క విపరీతంగా మొరిగేది అని చంకీ పాండే తెలిపారు.

 వేశ్యా వాటికలో గడిపాను

వేశ్యా వాటికలో గడిపాను

ఈ పాత్ర కోసం నా భార్య అనుమతితో అమెరికాలోని అలాస్కాలోని దారుణమైన వేశ్యా వాటికను సందర్శించాను. ఒకరోజు అంతా అక్కడ గడిపి పరిస్థితులను ఒంట పట్టించుకొన్నాను. దాంతో పాత్రను చాలా ప్రభావవంతంగా పోషించాను అని చంకీ వెల్లడించారు.

 విలన్‌గా కనిపిస్తా..

విలన్‌గా కనిపిస్తా..

బేగం జాన్ చిత్రంలో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రను పోషించాను. మత కల్లోలాను రెచ్చగొట్టే పాత్ర కోసం దాదాపు గుండు కొట్టించుకొన్నాను. సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయం. దాంతో నేను పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కుతుంది అని చంకీ చెప్పాడు.

 కిరాయి గూండాగా

కిరాయి గూండాగా

బేగంజాన్ చిత్రంలో కబీర్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో నులక మంచంపై కూర్చొని పొగాకు నములుతూ కనిపించే పాత్రలో కనిపించారు. బ్రోతల్ కంపెనీ యజమాని, ఇతర వేశ్యలను మట్టుపెట్టడం కోసం కిరాయి గుండా పాత్రలో నటించారు. ఈ పాత్రను బెంగాల్ వెర్షన్‌లో జిసు సేన్‌గుప్తా పోషించారు.

 పట్టుబట్టి గౌహర్ ఖాన్‌ను

పట్టుబట్టి గౌహర్ ఖాన్‌ను

బెంగాల్ భాషలో విమర్శకుల ప్రశంసలందుకొన్న రాజ్ కహిని అనే చిత్ర ఆధారంగా బేగం జాన్ తెరకెక్కింది. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర కోసం టెలివిజన్ నటి, మోడల్ గౌహర్ ఖాన్ పట్టుబట్టి తీసుకొన్నదట. ఒక టెలివిజన్ షోలో ఆమె ప్రతిభను చూసి ముచ్చట పడ్డాను. అందుకే ఆమెను ఈ చిత్రంలో తీసుకోవాలని నిర్మాత, దర్శకులకు ఒప్పించాను అని విద్యాబాలన్ ఇటీవల వెల్లడించారు.

English summary
Bollywood actor Chunky Pandey is playing hired assassin in Begam Jaan movie. He said My wife shrieked and refused to let me sneak into the bedroom for a fortnight and my pet dog kept barking, as if I was an intruder.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu