»   » ఆ బ్యూటీకి షారుక్‌కు మించిన క్రేజ్.. పెండ్లి చేసుకొంటావా? సెల్ఫీతో వైరల్

ఆ బ్యూటీకి షారుక్‌కు మించిన క్రేజ్.. పెండ్లి చేసుకొంటావా? సెల్ఫీతో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమ్మాయిలతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తీసుకొన్నసెల్ఫీ ఓ యువతి జీవితాన్నే మార్చివేసింది. ప్రస్తుతం సైమా హుస్సేన్ అనే అమ్మాయి ఇంటర్నెట్‌లో సెలబ్రిటీ హాదాను సంపాదించుకున్నది. రయీస్ చిత్ర ప్రమోషన్ కోసం షారుక్ పుణేకు వెళ్లిన సందర్భంగా ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది.

క్రేజ్‌లో షారుక్‌ను తలదన్నిన బ్యూటీ

క్రేజ్‌లో షారుక్‌ను తలదన్నిన బ్యూటీ

పుణేలోని సింబయోసిస్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్‌తో కూడిన అభిమానుల గుంపుతో షారుక్ సెల్ఫీ తీసుకొన్నారు. ఆ ఫొటోలో అందర్ని తలదన్నేలా కనిపించిన ఒక అమ్మాయి ఫొటోను పలువురు షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో చాలా అమ్మాయిలు ఉండగా ఆలివ్ గ్రీన్ కలర్ చొక్కా వేసుకున్న అమ్మాయి చిత్రాన్ని రౌండప్ చేసి చాలామంది షేర్ చేయడం మొదలుపెట్టారు.

సుందరి ఎక్కడ.. పెండ్లి చేసుకుంటావా?

సుందరి ఎక్కడ.. పెండ్లి చేసుకుంటావా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ను పక్కన పెట్టి ఫొటోలోని సీమా గురించి నెటిజన్లు ఎంక్వరీ చేయడం మొదలుపెట్టారు. ‘నీవు ఎక్కడ ఉంటావు. నన్ను పెండ్లి చేసుకొంటావా' అని మ్యారేజ్ ప్రతిపాదనలు పంపుతున్నారు. కశ్మీర్ కు చెందిన సైమా హుస్సేన్ సింబాయిసిస్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నది.

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సేమా

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సేమా

సోషల్ మీడియాలో తన ఫొటో వైరల్‌గా మారిన విషయం సేమాకు తెలియదట. తన స్నేహితురాలు చెప్పగానే ఆశ్చర్యానికి గురైందట. ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతున్న అందమైన ముద్దుగుమ్మ సైమా జాతకం మారుతుందా షారుక్ దృష్టిలో పడి హీరోయిన్ అవుతుందా అనే ప్రశ్నలకు కాస్తా వేచి చూడాల్సిందే.

పాక్ ఛాయ్‌వాలా మాదిరిగానే.. సేమా

పాక్ ఛాయ్‌వాలా మాదిరిగానే.. సేమా

ఈ ఘటన పాకిస్థాన్‌లో ఓ చాయ్‌వాలా ఘటనను గుర్తు తెస్తున్నది. సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌గా మారడంతో పాక్ యువకుడు అర్షద్ ఖాన్ మోడల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ యువకుడికి సినిమా ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వస్తున్నట్టు సమాచారం.

English summary
Kashmir's Saima Hussain is now social media sensation. In Raees promotion Shah Rukh Khan's Pune selfie gets great craze. Symbiosis Institute of Design (SID)'s mystery girl now gets media attention.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu