twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ అదరగొట్టాడు: ‘నా పేరు సూర్య’ మూవీ హైలెట్స్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Naa Peru Surya Movie Public Talk

    అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. వక్కంతం వంశీ ఫస్ట్ డైరెక్షన్ అయినప్పటికీ అద్భుతంగా సినిమాను హ్యాండిల్ చేశాడని అంటున్నారు. సినిమాలో దేశభక్తి అంశాన్ని చాలా బాగా ఫోకస్ చేశారని, ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సైనికులపై గౌరవం మరింత పెంచేలా ఈ సినిమా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    బన్నీ ఇంట్రడక్షన్ సీన్ హైలెట్

    బన్నీ ఇంట్రడక్షన్ సీన్ హైలెట్

    ఓ పబ్ సీన్ తో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ మొదలవుతుందని, ఇందులో బన్నీ పెర్ఫార్మెన్స్ విజిల్స్ కొట్టే విధంగా ఉందని, ఇండియా థీమ్ సాంగుతో సినిమా మొదలైన తీరు బావుందనే టాక్ వినిపిస్తోంది. పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ చాలా బాగా చిత్రీకరించారని అంటున్నారు.

    ఆర్మీ ట్రైనింగ్, సోల్జర్స్ త్యాగం

    ఆర్మీ ట్రైనింగ్, సోల్జర్స్ త్యాగం

    సినిమాలో ఆర్మీ ట్రైనింగ్ ఎపిసోడ్, దేశం కోసం సైనికులు ఎలాంటి త్యాగాలు చేస్తున్నారనే అంశాలు ఫోకస్ చేసిన తీరు సూపర్బ్ గా ఉంది. ఓ సైనిక సాంగ్ రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించారు. తెలుగులో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త మిలటరీ బ్యాక్ డ్రాప్‌తో మూవీ సాగుతుంది.

    లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో సాంగ్

    లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో సాంగ్

    సినిమాలో లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో సాంగ్ తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమాలో లేని విధంగా భిన్నంగా తీశారు. యూఎస్ఏలో చిత్రీకరించిన ఈ పాట అల్లు అర్జున్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

     ప్రతి సీన్లో అల్లు అర్జున్ హార్డ్ వర్క్

    ప్రతి సీన్లో అల్లు అర్జున్ హార్డ్ వర్క్

    ప్రతి సీన్లో అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కనిపిస్తోందని, సూర్య పాత్రలో బన్నీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు ఆడియన్స్ నుండి వ్యక్తం అవుతోంది. అతడి పాత్రలో యాంగ్రీనెస్, దేశ భక్తి దర్శకుడు అద్భుతంగా ఫోకస్ చేశాడని అంటున్నారు.

    ఆ ఫైట్ సీన్ టెర్రిఫిక్‌గా ఉంది

    ఆ ఫైట్ సీన్ టెర్రిఫిక్‌గా ఉంది

    ఈ చిత్రంలో సాయి కుమార్ ముస్తఫా పాత్రలో నటించారని, అతడి పాత్ర ఎంతో ఎమోషనల్ గా ఉందని, సాయి కుమార్ ఇంట్లో జరిగే ఫైట్ సీన్ టెర్రిఫిక్ గా ఉందని అంటున్నారు.

    ఇరగ ఇరగ మాస్ సాంగ్

    ఇరగ ఇరగ మాస్ సాంగ్

    సినిమాలోని ఇరగ ఇరగ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని, బన్నీ స్టైల్ లో ఫుల్ మాస్ అప్పియరెన్స్‌తో ఈ పాట సాగుతుందని అంటున్నారు.

    రోమాలు నిక్కబొడిచేలా సన్నివేశాలు

    రోమాలు నిక్కబొడిచేలా సన్నివేశాలు

    సినిమాలో చాలా చోట్ల రోమాలు నిక్కబొడిచేలా సన్నివేశాలు డిజైన్ చేశారని, క్లైమాక్స్ చాలా బావుందని, సినిమా జై హింద్ అంటూ ఎమోషన్‌తో ముగుస్తుందని, ఓవరాల్‌గా సినిమా చాలా బావుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

    English summary
    Naa Peru Surya Na Illu India movie highlights. Naa Peru Surya, Naa Illu India film written and directed by Vakkantam Vamsi (in his directorial debut). Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. The film will be released in Tamil as En Peru Surya En Veedu India, and in Malayalam as Ente Peru Surya Ente Veedu India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X