»   » అన్ని ఇండియాల్లేవురా మనకి: ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ కేక

అన్ని ఇండియాల్లేవురా మనకి: ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ కేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. సినిమా ప్రమోషన్లో భాగంగా డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. దేశం అంతా ఒకటే.... మనమంతా భారతీయులం అని దేశ భక్తిని పెంపొందించేలా ఈ టీజర్ డిజైన్ చేశారు.

అన్ని ఇండియాల్లేవురా మనకు

హీరో విలన్లను చితక్కొట్టే క్రమంలో ఒకడు సౌతిండియా కా సాలా.... అంటూ తిడతాడు. దీనికి హీరో రియాక్ట్ అవుతూ ‘సౌతిండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి...ఒక్కటే ఇండియా' అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

బన్నీ బర్త్ డే స్పెషల్

బన్నీ బర్త్ డే స్పెషల్

నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు. అభిమానుల్లో ఉత్సాహం నిపండంలో బాగంగా ఈ టీజర్ విడుదల చేశారు. ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' టీం నుండి బన్నీకి అందిన ది బెస్ట్ బర్త్ డే విష్ గా అభిమానులు దీన్ని పేర్కొంటున్నారు.

సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు, టీజర్లు సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ చిత్రం మే 4న రిలీజ్‌ కానున్నది. మెగా బ్రదర్ నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శిరీష్, బన్నీవాసు నిర్మిస్తున్నారు. కథా, మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

బన్నీ సక్సెస్‌ఫుల్ జర్నీ

బన్నీ సక్సెస్‌ఫుల్ జర్నీ

8 ఏప్రిల్, 1983న జన్మించిన అల్లు అర్జున్ 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. బన్నీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే 15 ఏళ్ళు గడచిపోయింది. 2003 మార్చి 28 న అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి విడుదలయింది. ఈ పదిహేను సంవత్సరాలలో నటుడిగా బన్నీ బాగా రాటుదేలాడు. మెగా మేనల్లుడిగా అడుగుపెట్టినా తన ప్రతిభతో అల్లు అర్జున్ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన వైనం

స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన వైనం

మొదట్లో గంగోత్రి, ఆర్య వంటి ప్రేమ చిత్రాలు చేసిన బన్నీ నెమ్మదిగా కమర్షియల్ హీరోగా ఎదిగి స్టైలిష్ స్టార్ గా మారాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో చోటు దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ సినిమా అంటే భారీ ఎపెనింగ్స్, వంద కోట్ల పైగా గ్రాస్ వసూలు చేస్తాయి అనే స్థాయికి వెళ్లాడు.

English summary
Naa Peru Surya Naa Illu India Dialogue Impact Starring Allu Arjun, Anu Emmanuel. Music By Vishal–Shekhar, Directed By Vakkantham Vamsi & Produced By Sirisha Sridhar Lagadapati & Bunny Vas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X