»   » రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సినీ హీరో..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సినీ హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగిన్2 చిత్ర హీరో కరణ్‌వీర్ బోహ్రా రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. హమే తుమ్సే ప్యార్ కిత్నా చిత్రానికి
సంబంధించిన షూటింగ్‌కు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తుక్కుతుక్కైన కారు ముందు భాగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాకు షేర్ చేశారు. ఈ చిత్రం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా జీవితంలోని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కుతున్నది.

షూటింగ్‌కు వెళ్తుండగా

షూటింగ్‌కు వెళ్తుండగా

ప్రమాదం జరిగినప్పుడు కరణ్ వీర్ వెంట సినీ నటి ప్రియా బెనర్జీ, ఆమె సోదరి మీనాక్షి ఉన్నారు. వారు ముగ్గురు తృటిలో భారీ ముప్పు నుంచి క్షేమంగా బయటపడ్డారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే కరణ్ వీర్, ప్రియా, మీనాక్షి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ముంబైకి తిరుగుప్రయాణమయ్యారు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాం. సడన్‌గా కుదిపేయడంతో వెన్నుభాగంలో దెబ్బ తగిలింది.

ట్రక్కును తప్పించబోయి

ట్రక్కును తప్పించబోయి

ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించబోయి ఫుట్‌పాత్ మీద పోల్‌ను ఢీకొట్టాను. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం గంటకు 95 కిలో మీటర్ల వేగంతో వెళ్తుతున్నది. కారు డ్రైవర్‌ను 100 కంటే మించవద్దని చెప్పాను అని కరణ్ వీర్ మీడియాకు వెల్లడించారు.

తుక్కు తుక్కైన కారు.. 50 మీటర్ల దూరం

తుక్కు తుక్కైన కారు.. 50 మీటర్ల దూరం

ప్రమాదం జరిగిన చోట కారు 50 మీటర్ల దూరం ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. పాట షూటింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

రాజీవ్, సోనియా జీవితంలోని కీలక..

రాజీవ్, సోనియా జీవితంలోని కీలక..

హమే తుమ్సే ప్యార్ కిత్నా చిత్రం సోనియా, రాజీవ్ గాంధీల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవు. ప్రధాన కథను తీసుకొని కల్పిత సన్నివేశాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రాజీవ్, సోనియా ప్రేమకు ట్రిబ్యూట్‌గా ఈ చిత్రం నిలుస్తుంది.

English summary
Karanvir Bohra was accompanied by his co-star Priya Banerjee and his sister Meenakshi. Luckily they escaped with just minor injuries. He was on his way to Bhuj where he was scheduled to shoot a song for his upcoming film, Hume Tumse Pyaar Kitna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu