»   »  వివాదాస్పదం కాదు ఎప్పుడో రాసుకున్న డైలాగ్ అది: ప్రేక్షకులకు వివరణ ఇచ్చుకున్న దర్శకుడు

వివాదాస్పదం కాదు ఎప్పుడో రాసుకున్న డైలాగ్ అది: ప్రేక్షకులకు వివరణ ఇచ్చుకున్న దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేను ప్రయోగాత్మక చిత్రాలు చేయడా నికే ఇష్టపడతాను. ఎందుకంటే తెలుగులో ఉన్నా, లేకపోయినా ఇటువంటి సినిమాలకు కోలీవుడ్‌లో (తమిళ్) ఎప్పుడూ డోర్‌ ఓపెన్‌లోనే ఉంటుంది. నా బలం తమిళ ప్రేక్షకులే. ప్రయోగాలకు ఇక్కడ తప్పక ఆదరణ లభిస్తుంది' అని చెప్పాడు రానా. నటించిన తాజా చిత్రం 'నాన్‌ ఆనై విట్టాల్‌' (తెలుగులో 'నేనే రాజు నేనే మంత్రి) ప్రమోషన్‌లో భాగంగా గురువారం చెన్నైలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.దర్శకుడు తేజాతో కలిసి పక్కా తమిళ సాంప్రదాయ పద్దతైన తెల్లని లుంగీ కట్టు తో ప్రెస్ మీట్ కి వచ్చాడు రానా.

సీఎం అంటూ

సీఎం అంటూ

‘100 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి రిసార్ట్‌లో పెడితే సాయంత్రానికి నేను కూడా అవుతా... సీఎం' అంటూ 'నేనే రాజు నేనే మంత్రి'లో రానా చెప్పిన డైలాగ్, తెలుగులోకన్నా, తమిళంలో ఎక్కువ కలకలాన్ని సృష్టించిన వేళ, సినిమా దర్శకుడు తేజ స్పందించాడు.

Rana's Nene Raju Nene Mantri becomes world’s first movie With 3D Augmented Reality
నాన్ ఆనైవిట్టాల్

నాన్ ఆనైవిట్టాల్

ఇటీవల తమిళ రాజకీయాల్లో జరిగిన ఘటన ఆధారంగా సినిమాలో ఈ సీన్ ను అల్లుకుని ఉంటారని ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ఆ వార్తలను కొట్టి పారేశాడు. తమిళంలో 'నాన్ ఆనైవిట్టాల్' పేరిట విడుదలవుతున్న చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తేజ మాట్లాడుతూ, ఆ డైలాగున్న సీన్ ను ముందే తీసుకున్నామని, అయితే, 'రిసార్ట్' అన్న పదం స్థానంలో తొలుత 'హోటల్' అని పెట్టామని, తమిళనాడు ఘటనల నుంచి ప్రేరణతో 'రిసార్ట్' అంటే బాగుంటుందన్న అభిప్రాయంతో స్వల్పంగా మార్చామని అన్నాడు.

ఎందుకంటే ఇక్కడ

ఎందుకంటే ఇక్కడ

‘నా సినిమాలకు తమిళంలో మంచి ఆదరణ ఉంటుందని తెలుగులో అందరికీ చెబుతుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రయోగాల్ని, కొత్తదనంతో కూడిన సినిమాల్ని బాగా ఆదరిస్తారు. నేను కూడా ప్రయోగాలు చేయడానికే ఇష్ట పడతాను. ‘బాహుబలి', ‘ఘాజీ', ఇప్పుడు ‘నాన్‌ ఆనైవిట్టాల్‌'... ఇవన్నీ వేటికవి భిన్నమైనవే. ప్రయోగాత్మక సినిమాలే.

రాజ కీయ చిత్రం

రాజ కీయ చిత్రం

తమిళ ప్రేక్షకులే నా బలమని నేను నమ్ముతున్నాను. ఇక సినిమా విషయానికొస్తే, ఇది కేవలం రాజ కీయ చిత్రం మాత్రమే కాదు. భార్యాభర్తల మధ్య అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఇందులో హీరో తన భార్య పేరు కలిసేలా రాధా జోగేంద్ర అని పేరు పెట్టుకుంటాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది'' అని రానా మరీ ఇది గా తమిళ ప్రేక్షకులని మాటలతో పడేసే ప్రయత్నం చేసాడు.

English summary
"That was just a Co Incidence" Director teja about 100MLAs dialogue in Nene Raju Nene Mantri Tamil version Naan Aanaiyittal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu