For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బ్రేకింగ్: ఆస్కార్ షార్ట్ లిస్టులో RRR.. అధికారిక ప్రకటన.. ప్రతిష్టాత్మక అవార్డుకు మరింత చేరువ

  |

  ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో.. ఇద్దరు బడా హీరోల కలయికలో రూపొందిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. దీంతో ఈ చిత్రానికి పలు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆస్కార్ 2023 షార్ట్ లిస్టులో RRR మూవీ చోటు దక్కించుకుంది. ఆ సంగతులు మీకోసం!

  స్టార్ హీరోలతో జక్కన్న మూవీ

  స్టార్ హీరోలతో జక్కన్న మూవీ


  స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా నటించారు.

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!

  వేయి కోట్లు దాటేసి బీభత్సం

  వేయి కోట్లు దాటేసి బీభత్సం


  రిలీజ్‌కు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన RRR మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 613.06 కోట్లు షేర్, రూ. 1150.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ఎన్నో రికార్డులను కూడా ఇది క్రియేట్ చేసుకుంది.

  ఓటీటీతో ప్రపంచ వ్యాప్తంగా

  ఓటీటీతో ప్రపంచ వ్యాప్తంగా

  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. అంతేకాదు, ఈ చిత్రం ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించి సత్తా చాటుకుంది.

  బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!

  RRRకు ఆస్కార్ అవార్డులు

  RRRకు ఆస్కార్ అవార్డులు

  ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 2023 అకాడమీ అవార్డుల్లో ఆస్కార్స్ వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వెరైటీ మ్యాగజైన్ పలు విభాగాల్లో పాజిబులిటీ లిస్టులు విడుదల చేసింది. వాటిలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది. దీనికితోడు ఇండియన్స్ అంతా RRRకు ఆస్కార్ ఇవ్వాలని డిమాండ్స్ చేస్తున్నారు.

  షార్ట్ లిస్టులో నాటు నాటు

  షార్ట్ లిస్టులో నాటు నాటు


  2023 ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌ ప్రకటనకు సమయం దగ్గర పడుతోంది. దీంతో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ పలు విభాగాల్లో నామినేట్ అవుతుందని ప్రచారాలు జోరందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీలోని 'నాటు నాటు' సాంగ్ 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  15 పాటల్లో RRR సాంగ్

  15 పాటల్లో RRR సాంగ్


  2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచింది. వాటిలో RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. దీంతో సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  అసలైన లిస్టు ఎప్పుడంటే

  అసలైన లిస్టు ఎప్పుడంటే

  ఇక, 2023లో ప్రకటించే 95వ అకాడమీ లేదా ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ను జనవరి 24, 2023న ప్రకటించబోతున్నారు. ఇందులో కూడా నాటు నాటు పాట చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, వీటికి సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం మార్చి 12, 2023న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది.

  English summary
  Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Now Naatu Naatu From This Movie Shortlisted for Best Original Song at the 2023 Oscars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X