»   » బాలయ్య సినిమాలో పవర్ స్టార్ అత్త!

బాలయ్య సినిమాలో పవర్ స్టార్ అత్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాజాగా విడుదలై విజయవంతంగా ముందుకు సాగుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అత్త పాత్రలో నటించిన అంరినీ మెప్పించిన నటి నదియా.....బాలయ్య సినిమాలో కూడా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న 'లెజెండ్'లో నదియా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఆమె ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర లో కనిపించబోతోంది? అనేది తేలాల్సి ఉంది. తండ్రి పాత్రలో కనిపించే బాలకృష్ణకు భార్యగా? లేదా యంగ్ బాలయ్యకు అత్తగా? నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయం అఫిషయల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టె హీరోయిన్లు. జగపతి బాబు విలన్ పాత్రలో చేస్తున్నాడు. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజిక్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు. ఈ చిత్రానికి 'లెజెండ్', 'జయసింహ' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అంతా మొదట అనుకున్నారు. కానీ పిబ్రవరికి వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి ల లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయనుండటంతో ఈ చిత్రం కొంత వరకూ హెల్ప్ అవుతుందని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

English summary
Film Nagar source said that, Nadiya is likely to play a crucial role in Nandamuri Balakrishna new movie LEGEND under boyapti srinu direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu