»   » 'అత్తారింటికి దారేది' లో ఎంతో గౌరవప్రదంగా నదియా...ఇప్పుడు లెస్బియన్ గోలేంటి,

'అత్తారింటికి దారేది' లో ఎంతో గౌరవప్రదంగా నదియా...ఇప్పుడు లెస్బియన్ గోలేంటి,

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: లెస్బియన్ వంటి సబ్జెక్టులతో పేరున్న ఆర్టిస్టులు సినిమాలు చేయటానికి వెనకాడతారు. కానీ నదియా మాత్రం అలాంటిదేమీ లేదని ధైర్యంగా సినిమా చేసింది. ఇప్పుడా సినిమా తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. తెలుగులోనూ డబ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. మరో ప్రక్క కొందరు మాత్రం నదియా ఇలాంటి సినిమాలో చేయటం ఏంటి విమర్శలు చేస్తున్నారు. ఏదైమైనా సినిమా రిలీజ్ అయితే కానీ విమర్శించటం అనవసరం కదా.

హీరోయిన్ గా మంచి అవకాశాలు ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పారు నదియా. వైవాహిక జీవితం అనంతరం 'ఎం.కుమరన్‌ సన్నాఫ్‌ మహాలక్ష్మి'(అమ్మా..నాన్నా తమిళ అమ్మాయి రీమేక్ ) చిత్రంతో ఆమె జయంరవికి తల్లిగా తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చారు.

అలాగే తెలుగులో 'అత్తారింటికి దారేది' వంటి పలు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అతి తక్కువ సినిమాలను ఎంచుకుంటున్న ఆమె తాజాగా 'తిరైక్కు వరాద కదై' చిత్రంలో నటించారు. ఎంజేడీ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై మణికంఠన్‌ నిర్మించిన ఈ చిత్రానికి తులసిదాస్‌ దర్శకత్వం వహించారు.

ఇక ఈ చిత్రం లెస్బియన్ కథాంసం చుట్టూ తిరుగుతుంది. తమిళ సిని చరిత్రలోనే ఇలాంటి కథ ఇదే మొదటి సారి అంటున్నారు. అందరూ ఆడవాళ్లతో నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా ఓ మర్డర్ మిస్టరీ గా జరుగుతుందని చెప్తున్నారు.

Nadiya

దర్శకుడు మాట్లాడుతూ..నేను ఈ చిత్రం కథకు ప్రేరణగా మళయాళ ఛానెల్ లో వచ్చే ఓ పోగ్రామ్ ని తీసుకున్నాను. ఇప్పటికే మళయాళం, హిందీ భాషల్లో ఈ తరహా లెబ్సియన్ ధీమ్ లతో కథలు వచ్చాయి. అయితే నేను ఈ విషయాన్ని సెన్సేషనలైజ్ చెయ్యలేదు. ఓ మర్డర్ మిస్టరీగా మార్చాను. ఇలాంటి రిలేషన్స్ మన సంస్కృతికి వ్యతిరేకం అని చెప్తున్నాను అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఈ సినిమా చాలా డిఫెరెంట్ ధీమ్ తో ఉండటం, హీరో లేకపోవటం వంటి వాటితో నేను నిర్మించదలచుకోలేను అని చెప్పాను. కానీ తులసీదాస్ నేరేట్ చేసిన విధానం నన్ను ఈ సినిమా నిర్మించేలా చేసింది. ఈ సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. క్లైమాక్స్ లో ఓ అద్బుతమైన ట్విస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు రివీల్ చెయ్యను అన్నారు.

సినిమా గురించి నదియా మాట్లాడుతూ ఇది ఓ క్రైం కథా చిత్రం. పాత్ర బాగా నచ్చితేనే ఆ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తున్నా. ఆ కోణంలో పోలీసు అధికారిగా, ఓ ముఖ్యమైన ఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకునే పాత్రను పోషించా. నిజంగా ఇది సవాలుతో కూడుకున్న పాత్ర. డబ్బు కన్నా నేను నటించే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

English summary
Thiraikku Varadha Kadhai, a bilingual directed by Malayalam filmmaker Thulasidas, will feature a lesbian relationship, perhaps for the first time in Tamil cinema. A murder mystery with an all-women cast.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu