»   » పెళ్లి భయం.. ( ‘పెసరట్టు’ ప్రివ్యూ)

పెళ్లి భయం.. ( ‘పెసరట్టు’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :‘ఐస్ క్రీం' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఫ్లోకామ్ టెక్నాలజీను పరిచయం చేయడంతో పాటు మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు ముందు రెమ్యునరేషన్ ఇవ్వకుండా, హిట్ అయితే లాభాలలో వాటా ఇస్తారు. వర్మ స్ఫూర్తితో ఆ టెక్నాలిజీనీ, ఆ ఐడియాని అందిపుచ్చుకుని సినీ విమర్శకుడు, దర్శకుడు కత్తి మహేష్ ‘పెసరట్టు' సినిమాను తీసారు. ఈ కాన్సెప్ట్ మరియు కథ నచ్చడంతో కీలక పాత్రలో నటించడానికి ముందుకొచ్చారు ‘100% లవ్', ‘ఆటో నగర్ సూర్య' సినిమాల ఫేం నందు. ఈ వినోదాత్మక చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కమిటిమెంట్ ఫోబియాతో ఉన్న భావన(నిఖిత నారాయణ) తనను ప్రేమించిన ఇద్దరు ప్రేమికులను, నిశ్చితార్దానికి సిద్దంగా ఉన్న కాబోయే భర్తని నందు(నందు) ని ఎలా ఇబ్బందులు పాలు చేసింది. ఆ పెళ్లి భయానికి, పెసరట్టు కీ లింక్ ఏంటి అనేది చిత్రం కథ. చిత్రంలో నందు త్రిబుల్ యాక్షన్ చేస్తున్నారు


Nadu's Pesarattu movie preview

కత్తి మహేష్ మాట్లాడుతూ ....వివాహ నిశ్చితార్థం నేపథ్యంలో జరిగే కథ ఇది. వ్యంగ్యం, సునిశితమైన హాస్యం మేళవింపుతో వుంటుంది. అంతర్లీనంగా ఓ సీరియస్ అంశాన్ని చర్చిస్తూ సాగుతుంది. ఈ సినిమా ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం అన్నారు.


నిశ్చితార్ధం, పెళ్లి నేపద్యంలో కథను ‘పెసరట్టు' సినిమా కథను రెడీ చేశారు కత్తి మహేష్. సెటైరికల్ కామెడీకి పెద్ద పీట వేస్తున్నారు. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. సినిమాలో మొత్తం 32 సన్నివేశాలు ఉంటాయి. నటీనటులకు 14 రోజుల వర్క్ షాప్ నిర్వచించిన తర్వాత మాత్రమే షూటింగ్ చేసారు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ...తొలి తెలుగు క్రౌడ్‌ ఫండింగ్‌ విధానంతో రూపొందించిన సినిమా ఇది.


మహేష్ కత్తి మాట్లాడుతూ... ‘‘సినీ ప్రేమికులు 12 మంది కలిసి నిర్మించారు. ఫేస్‌బుక్‌ నుంచి 35 మంది నటీనటుల్ని ఎంపిక చేశాం. ‘పెసరట్టు' అనే టైటిల్‌ కథాపరంగా చాలా కీలకమైంది'' అని దర్శకుడు మహేష్‌ కత్తి చెప్పారు.


హీరోయిన్ నిఖితా మాట్లాడుతూ... తొలి క్రౌడ్‌ ఫండింగ్‌ చిత్రంలో తాను నటించడం ఆనందంగా ఉందని నందు అన్నారు. 13 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేశామని, రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని నిఖితా తెలిపారు. ఐదు పాటలున్నాయని సంగీత దర్శకుడు ఘంటశాల విశ్వనాథ్‌ చెప్పారు. మంచి సినిమా అవుతుందని భీమసేనమూర్తి, సుభాష్‌ నారాయణ్‌ తెలిపారు.


బ్యానర్: రిచ్చెజ్జా మీడియా ఫ్యాక్టరీ, టెంపుల్ టౌన్ టాకీస్
నటీనటులు: నందు, నికితా నారాయణ్‌, సంపూర్ణే్‌షబాబు కీలక పాత్రధారులు.
కెమెరా: కమలాకర్
నిర్మాతలు: శ్రీనివాస్, శేషగిరి, సుకుమార్, కిరణ్, స్వప్నరాణి
రచన అరిపిరాల సత్య ప్రసాద్
ఆర్ట్ డైరక్టర్ ధర్మేధ్ర జిల్లే పల్లి
కాస్టూమ్స్ నీహారిక కన్నన్
పాటలు సుభాష్ నారాయణ్, సిరాశ్రీ
ఎడిటర్: ప్రశంకర్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్‌ కత్తి
సంగీతం: ఘంటశాల విశ్వనాథ్‌
విడుదల తేదీ:06-02-2015

English summary
Get ready to watch Kathi Mahesh's Pesarattu movie right from this Friday . Pesarattu Starring with Sampoornesh Babu, Nandu, Nikitha. Directed By Kathi Mahesh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu