twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మతో నాగార్జున క్లాష్ తప్పదా?

    By Srikanya
    |

    నాగార్జున తాజా చిత్రం గగనం, రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు ఈ రెండు చిత్రాలు పిబ్రవరి నాలుగవ తేదిన విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అంటే నాగార్జున చిత్రం వర్మ చిత్రంతో పోటీ పడనుందన్నమాట. ఇక ఈ రెండు చిత్రాలు ఎక్సపరమెంటల్ చిత్రాలే కావటం కూడా ఓ విశేషం.

    గగనం చిత్రం విషయానికి వస్తే...విమానం హైజాక్‌, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది. గగనంలో కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నాగార్జున. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్పాలి. మంచి ఎమోషనల్‌ డ్రామా కూడా ఉంది.

    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు అని వేయించుకోవటానికి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వాలిన అప్పలరాజు కథే ఇది. కథ ప్రకారం ...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్ ‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే.

    ఇక ఈ రెండు చిత్రాలలో ఏది నిలబడుతుంది అనేది ప్రక్కన పెడితే గగనం చిత్రం మరో వారం వాయిదా వేసే అవకాశం కూడా ఉందని అంతర్గత వర్గాలు సమచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X