»   » ఇంట్రెస్టింగ్: హే దెయ్యం....నిహారిక గురించి నాగబాబు!

ఇంట్రెస్టింగ్: హే దెయ్యం....నిహారిక గురించి నాగబాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక ఈ నెల 24న విడుదలవుతున్న 'ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రీ కూతుళ్లిద్దరూ ఓ ప్రముఖ పత్రిక కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు తన కూతురు గురించి తన మనసులోని విషయాలను చెప్పుకొచ్చారు.

నిహారికను ఎప్పుడూ హీరోయిన్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ప్రొడక్షన్ లేదా డైరెక్షన్ వైపో అనుకున్నా. హీరోయిన్‌గా అంటే కాస్త ఆలోచించాను. ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలే రావాలా? అమ్మాయిలను హీరోయిన్లుగా ఎందుకు తీసుకురారని నిహా అడగటంతో కాదనలేక పోయాను అన్నారు.


అమ్మాయంటే పెళ్లి చేసి పంపించేయాలనే అనుకుంటాం తప్ప.. తన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోం. రేపు పెళ్లయ్యాక తనకు ఎక్కడో నేను నటించలేదే అనిపిస్తే నన్ను తిట్టుకుంటుంది. పైగా నన్ను ఈ మాట అడిగిన తర్వాత ఏం మాట్లాడగలుగుతాను. అందుకే నేను ఎస్ చెప్పేశా అని నాగబాబు తెలిపారు.


సినిమా రంగాన్ని ఎంచుకోవడంపై నిహారిక స్పందిస్తూ...అన్ని కెరీర్స్‌లో కంటే.. సినిమాల్లో అయితే ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుంది. మనమేంటో అందరికీ తెలుస్తుంది. నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండే ప్రొఫెషన్ అంటే ఇష్టం. అందుకే ప్రొడ్యూసర్‌గా చేశా అని నిహారిక తెలిపారు.


ప్లానింగ్ ప్రకారమే ముందు టీవీ, తర్వాత వెబ్ సిరీస్, తర్వాత సినిమాల్లోకి తీసుకొచ్చారా? అనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ...ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేదండీ.. తననే అడగాలి. వెబకాకపోతే ఒక సలహా మాత్రం నేను ఇచ్చా. టీవీలో కనిపిస్తే కెమెరాని ఫోకస్ ఎలా చేయాలి? ఈ కెరీర్‌లో ఉండే ఇబ్బందులేంటో తెలుస్తుందని మాత్రం చెప్పాను అన్నారు.


నిహారిక స్పందిస్తూ...నాన్న చెప్పాక నాకు కూడా అదే నిజమనిపించింది. అందుకే ముందు యాంకరింగ్ మొదలుపెట్టా. ఆ తర్వాత వెబ్ సిరీస్ చేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ముద్దపప్పు ఆవకాయ్.. సినిమాలకు ట్రయల్ లాంటిదే. దానికి నేనే కథ, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించా. నా కథ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ప్రొడ్యూస్ చేశా. ఇక ముందు కూడా సినిమాలే కాదు.. నా నుంచి వెబ్ సిరీస్‌లు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నారు.


చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి

చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి

నిహారిక మాట్లాడుతూ....డాడీ(చిరంజీవి) పిల్లలందరినీ కూర్చొబెట్టుకొని గంటలు గంటలు మాట్లాడతారు. ఆయనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. నాకు ఆయనే బిగ్గెస్ట్ రోల్ మోడల్. హార్డ్‌వర్క్ డాడీ నుంచే నేర్చుకున్నా. ఇక బాబాయ్ చాలా తక్కువగా మాట్లాడతారు. ఎప్పుడైనా ఏం చేస్తున్నావు. కెరీర్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడిగేస్తారు అని తెలిపారు.


దెయ్యం...

దెయ్యం...

ఈ ఇంటర్వ్యూలో నిహారికను నాగబాబు ముద్దుగా హే దెయ్యం అని పిలవడం గమనార్హం. తనకు దెయ్యాలంటే చాలా భయమని నాగబాబు చెప్పుకొచ్చారు. ఒకసారి పిజ్జా సినిమాకు తీసుకెళ్లా. అది హర్రర్ మూవీ అని తనకి తెలియదు. నేను వెనుక నుంచి తల మీద చేయి పెట్టా. అంతే గట్టిగా అరిచేసింది. నేను ఒకటే నవ్వులు అని నాగబాబు చెప్పుకొచ్చారు.


లేనట్లు నటిస్తారేమో?

లేనట్లు నటిస్తారేమో?

నిహారిక స్పందిస్తూ...నన్ను దెయ్యం పేరు చెప్పి నాన్న, అన్నయ్య బాగా ఆడుకుంటారు. రాత్రిపూట ఒక్కదానినే నీళ్లు తీసుకురమ్మంటారు. సినిమాలు చూద్దామా? అనడిగితే.. హర్రర్ మూవీస్ తీసుకొస్తారు. అయినా వీళ్లకీ భయం ఉంటుందనుకుంటా. నా ముందు లేనట్టు నటిస్తారేమో! అంటూ నిహారిక తెలిపింది.


ఒక మనసు

ఒక మనసు

నిహారిక ఒక మనసు చిత్రానికి విషయానికొస్తే ఈ నెల 24న విడుదలువుతోంది.


English summary
Tollywood actor Naga Babu about his lovely daughter Niharika in news daily interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu