»   » కుసంస్కారి, అక్కుపక్షి: ‘ఖైదీ నెం 150’ ఫంక్షన్లో నిప్పులు చెరిగిన నాగబాబు

కుసంస్కారి, అక్కుపక్షి: ‘ఖైదీ నెం 150’ ఫంక్షన్లో నిప్పులు చెరిగిన నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు ఎంతో సందడిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాగుతుంటే.... మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరు వ్యక్తులపై నిప్పులు చెరుగుతూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.

నాగబాబు మాట్లాడుతూ.... వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పుకునే ఒకడు చరణ్ బాబు గురించి తప్పుగా మాట్లాడిన విషయం, తక్కువ చేసిన మాట్లాడిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు. కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతనొక మూర్ఖుడు. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే వాడికి అసలువ్యక్తిత్వం లేదు, వాడో కుసంస్కారి....అలాంటి వాడు చేసే కామెంట్స్ తమకు ఎలాంటి నష్టాన్ని కలిగించవు, వాడెవడో నేను చెప్పను, నా మాటలు వాడికి అర్థమవుతాయి అని ఫైర్ అయ్యారు.

Naga Babu

రీమేక్ సినిమాలు తీస్తే తప్పేంటని, చిరంజీవి నటించిన పలు చిత్రాలు ఇతర భాషల్లో రూపొందాయని ఈ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ముంబై వెళ్లి అక్కడ సినిమాలు తీసుకుంటున్న ఒకడు ట్విట్టర్లొ ఎప్పడూ ఏదో ఒకటి వాగుతుంటాడు, వాడో అక్కు పక్షి...వాడికి ఇపుడు సినిమాలు తీయడం చేతకావడంలేదు, పిచ్చికూతలు కూస్తున్నాడు. సరిగా సినిమా తీయడం కూడా రాదు. ముందు వాడు మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరించారు. ఎవరేం చేసినా హిట్టయ్యే సినిమాను ఆపలేరు...ఫెయిలయ్యే సినిమాను లేపలేరు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే.... ఆ రచయిత పేరు 'య................ థ్' అని ప్రచారం జరుగుతోంది. ఇక ఆ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని అంటున్నారు. గతంలో య.........థ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సర్జరీలు చేయించుకున్నట్లు వ్యాఖ్యానించారని, అందుకే నాగబాబు ఇలా ఫైర్ అయ్యారని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చిరంజీవి 150వ సినిమాపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Mega brother Naga Babu Fires On RGV at Khaidi No. 150 Event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu