For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పేరు నాది, డబ్బు అన్నయ్యది.. నష్టపోయాం, ఇపుడు ధైర్యం లేదు: నాగబాబు

  |

  నా ఛానల్ నా ఇష్టం పేరుతో కొన్ని రోజులుగా పొలిటికల్ సెటైరికల్ వీడియోలు వదులుతున్న మెగా బ్రదర్ నాగబాబు ఈ సారి రూటు మార్చి సినిమా టాపిక్ గురించి మాట్లాడారు. నిర్మాతగా తన తొలి సినిమా 'రుద్రవీణ' జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

  'రుద్రవీణ' అంజనా ప్రొడక్షన్ బేనర్లో ఫస్ట్ విడుదలైన సినిమా. అప్పుడే ఫ్రెష్‌గా ఎల్ఎల్‌బి పూర్తి చేసుకుని ఎంబీఏ చేద్దామనుకుంటే తనతో పాటు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా ఉండొచ్చుకదా అని అన్నయ్య అడిగారు. నాకు కూడా అన్నయ్యతో ఉండాలని, ట్రావెల్ చేయాలనే కోరిక ఉండేది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అని నాగబాబు తెలిపారు.

  అలా ‘రుద్రవీణ’ మొదలైంది

  అలా ‘రుద్రవీణ’ మొదలైంది

  ఫస్ట్ సినిమా ఎవరితో చేద్దాం, ఎలాంటి సినిమా చేద్దాం అనే చర్చలు జరుగుతుండగా.. శంకరా భరణం కమర్షియల్‌గా, అవార్డుల పరంగా సక్సెస్ అయింది. ఆ తరహా సినిమా చేద్దాం అనుకున్నాం. మొదటి సినిమాకే గట్టిగా కొడదామనుకుని ప్లాన్ చేశాం. బాలచందర్ గారితో మాట్లాడి 1986లో ‘రుద్రవీణ' మొదలు పెట్టాం. మధ్యలో బాలచందర్ గారికి వేరే సినిమా ఉండటంతో ఇది రిలీజ్ కావడానికి సంవత్సరన్నర పట్టింది.

  రిస్క్ ఉంటుందని తెలుసు

  రిస్క్ ఉంటుందని తెలుసు

  దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజాను పెట్టారు. ఆయన ఒకే రోజులో అన్ని ట్యూన్స్ చేశారు. ఇప్పుడు ఒక ట్యూన్ చేయాలంటే చాలా రోజులు తీసుకుంటున్నారు. సిరివెన్నెల గారు అన్ని పాటలు రాశారు. ఇది కమర్షియల్ సినిమా కాదు, రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంది అనేది కథ విన్నపుడు అర్థమైంది. రిలీజ్ అయితే సూపర్ హిట్ అవ్వొచ్చు, దెబ్బ పడొచ్చు. అన్నయ్య కూడా సాహసం చేశారు.

  హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టాం

  హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టాం


  అప్పట్లో సినిమాకు రూ. 85 నుంచి 90 లక్షల బడ్జెట్ ఖర్చు చేశాం. అప్పట్లో అది హయ్యెస్ట్ బడ్జెట్. మ్యూజిక్ హిట్టవ్వడంతో పెద్ద హిట్టుకొడుతున్నామనుకున్నాం. కానీ మాకు బిగ్ షాక్ తగిలింది. తొలి సినిమాతోనే కమర్షియల్‌గా ఫెయిల్యూర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మంచి సినిమా పోయిందని బాధ పడ్డాం. కానీ అన్నయ్యగారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అది.

  ఇప్పుడు ఆ ధైర్యం లేదు

  ఇప్పుడు ఆ ధైర్యం లేదు

  మంచి స్టార్ కాస్టింగుతో చేసిన సినిమా ‘రుద్రవీణ'. చాలా గొప్ప సినిమా. మళ్లీ అలాంటి సినిమా చేయమని ఎవరైనా కథ తీసుకొస్తే ఇప్పుడు ఆ ధైర్యం రాదు. అప్పుడు వయసులో ఉన్నాం. ఏం జరుగుతుందో చూద్దాం అనే తెగింపు ఉంది. శంకరా భరణం మాదిరిగా లక్షలు, కోట్లు సంపాదించి పెడుతుందని ఆశ పడ్డాం. కానీ చివరకు 10 లక్షల నుంచి 15 లక్షలు నష్టం వచ్చింది.

  డబ్బు అన్నయ్యదే, నష్టం భరించారు

  డబ్బు అన్నయ్యదే, నష్టం భరించారు

  ‘రుద్రవీణ' సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టింది అన్నయ్యే... కాబట్టి ఆయనే లాస్ ఫేస్ చేశారు. అయితే తొలి సినిమాకు కేవలం బాధ్యతల పరంగానే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నేషనల్ అవార్డ్స్ ప్రకటించినపుడు 3 అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం, బాలు గారికి ఉత్తమ నేపథ్యగాయకుడు అవార్డ్, ఇళయరాజాగారికి సెకండ్ టైమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది.

  అన్నయ్యను రిక్వెస్ట్

  అన్నయ్యను రిక్వెస్ట్

  ఢిల్లీ వెళ్లిన తర్వాత అన్నయ్యను రిక్వెస్ట్ చేశాను. ఈ అవార్డు నువ్వు అందుకుంటేనే బావుంటుంది.. ఒక గౌరవం ఉంటుందని చెప్పాను. ఆయన మొదట అలా వద్దు... నువ్వు ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వే తీసుకోవాలన్నారు. ఫోర్స్ చేస్తే చివరకు ఒప్పుకున్నారు. అలా అన్నయ్య నేషనల్ అవార్డ్ రాష్ట్రపతి నుంచి తీసుకోవడం జరిగింది. స్టేట్‌లో కూడా థర్డ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇచ్చారు. అయితే జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సినిమాకు మూడో స్థానంలో స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వడం కాస్త డిసప్పాయింట్ అనిపించిందని నాగబాబు తెలిపారు.

  English summary
  Rudraveena - A Sweet Memory says, Naga Babu. He speaks a few interesting facts about Chiranjeevi's #Rudraveena and it is one of the very few path-breaking films of Telugu Cinema, has completed 31 Years by today. It was released on March 4th, 1988. Rudraveena is a revolution and I have made 8-9 films on my home banner, but still, my first movie Rudraveena has given the satisfaction as a maker like no other flick says, #NagaBabu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more