»   »  నాగచైతన్య అలా డిసైడ్ చేశాడు.. పెరుగుతున్నపెళ్లి జోష్..

నాగచైతన్య అలా డిసైడ్ చేశాడు.. పెరుగుతున్నపెళ్లి జోష్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినీ పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ నరేన్ రూపొందించే నరకాసురుడు చిత్రంలో నాగచైతన్య, అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నటుడు అరవింద్ స్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రానికి నిర్మాతగా గౌతమ్ మీనన్ వ్యవహరిస్తున్నట్టు చెన్నై ఫిలింనగర్‌లో ఓ వార్త జోరుగా ప్రచారమవుతున్నది. నటీనటుల ఎంపిక ఇంకా పూర్తికావాల్సి ఉన్నది.

 తమిళ సినీ పరిశ్రమలోకి నాగచైతన్య

తమిళ సినీ పరిశ్రమలోకి నాగచైతన్య


నరకాసురుడు చిత్రం ద్వారా నాగచైతన్య తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించనున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో కలిసి ఆయన ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇటీవల నాగచైతన్యను దర్శకుడు కార్తీక్ కలిసి కథ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలిసింది.

నిశ్చితార్థం తర్వాత పెరిగిన జోరు

నిశ్చితార్థం తర్వాత పెరిగిన జోరు


సమంతతో నిశ్చితార్థం తర్వాత పెరిగిన జోరు
సమంతతో నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగచైతన్య జోరు మీద కనిపిస్తున్నాడు. తన కెరీర్‌లో 14వ చిత్రాన్ని కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తుతో ప్రారంభించాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నది.

 సంచలన దర్శకుడు కార్తీక్ నరేన్ చిత్రంలో

సంచలన దర్శకుడు కార్తీక్ నరేన్ చిత్రంలో


తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీక్ నరేన్‌కు ప్రస్తుతం సంచలన దర్శకుడిగా పేరున్నది. ఆయన తీసిన ‘ధరువాంగల్ పత్తిన్నారు' చిత్ర భారీ విజయాన్ని మూటగట్టుకొన్నది. ఆ వెంటనే నరకాసురుడు చిత్ర కథపై దృష్టిపెట్టాడు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్థ్రాత్మకంగా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 ధరువంగల్‌కు గౌతమ్ మీనన్ ప్రశంస

ధరువంగల్‌కు గౌతమ్ మీనన్ ప్రశంస


ధరువంగల్ 16 చిత్రం చూసిన తర్వాత నన్ను గౌతమ్ వాసుదేవ మీనన్ సర్ అభినందించాడు. నా తదుపరి చిత్రాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చారు. ధ్రువ నక్షత్రం చిత్ర షూటింగ్ సందర్భంగా ఆయనను కూనూర్‌లో కలిసాను. ఆ సందర్భంగా నా కథను వినిపించగా ఆయన ఓకే చేశారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు అని దర్శకుడు కార్తీక్ తెలిపాడు.

 నరకాసురుడు పక్కా కమర్షియల్ చిత్రం

నరకాసురుడు పక్కా కమర్షియల్ చిత్రం


నరకాసురుడు పక్కా కమర్షియల్ చిత్రమని ఇటీవల ఫేస్‌బుక్‌లో దర్శకుడు కార్తీక్ వెల్లడించారు. ఈ చిత్రం సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిస్తానని తెలిపారు. ధరువంగల్ 16 చిత్రానికి భిన్నంగా కథ సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రమేంటో ఆ టైటిల్‌తోనే స్పష్టమవుతుంది. 2017లో జూన్, జూలైలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

English summary
Tollywood star Naga Chaitanya is making his Tamil debut with suspense thriller Naragasooran under Karthick Naren’s direction. actors Arvind Swami and Naga Chaitanya are playing the leading roles in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu